Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎం రేవంత్ రెడ్డి‌తో కావ్య మారన్‌ కీలక భేటీ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ సమావేశం కానుంది. గురువారం జరగనున్న ఈ భేటీలో కావ్య మారన్‌తో పాటు మెగా కోడల కొణిదల ఉపాసన, లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్‌ గోయెంకా, భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ బైచుంగ్ భూటియా, ఒలింపిక్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాల కూడా పాల్గొననున్నారు.

బంజారాహిల్స్‌లో ఓ హోటల్‌లో జరగనున్న ఈ సమావేశంలో ఒలింపిక్స్ 2036పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ 'స్పోర్ట్స్ పాలసీ 2025'‌ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ'ను ఏర్పాటు చేసింది.

CM Revanth Reddy to Review 2036 Olympics Bid with Sports Hub of Telangana Members Including Kavya Maran

ఈ బోర్డు సభ్యురాలిగా కావ్య మారన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు చైర్మన్‌గా లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాను నియమించిన ప్రభుత్వం.. కో చైర్మన్‌ బాధ్యతలను మెగా కోడలు ఉపాసన కామినేనినికి అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బోర్డు సభ్యులుగా కావ్య మారన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమించింది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్ 2036పై సమీక్ష జరిపేందుకు స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ‌ ఛైర్మన్, కో ఛైర్మన్‌తో పాటు సభ్యులకు ఆహ్వానాలు అందాయి. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా శక్తిగా మార్చడమే కొత్త క్రీడా పాలసీ లక్ష్యం. ముఖ్యంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడం, క్రీడలను ఒక కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సహించడం, క్రీడాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రధాన లక్ష్యం. రాజకీయ జోక్యం తగ్గించాలన్న ఉద్దేశంతోనే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో 'స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ'ను ఏర్పాటు చేశారు.

చిన్న వయసులోనే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇచ్చి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ ప్రధాన లక్ష్యం. ప్రపంచ స్థాయి కోచింగ్, అత్యాధునిక మౌలిక సదుపాయాలను కూడా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ ద్వారా అందించనున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్' ద్వారా నిధులను సమీకరించి, వాటిని పారదర్శకంగా, సమర్థవంతంగా ఉపయోగించాల్సిన బాధ్యత కూడా ఈ సంస్థపై ఉంది. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు , క్రీడా సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకోనున్నారు.

Story first published: Wednesday, August 27, 2025, 14:25 [IST]
Other articles published on Aug 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+