సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ 'స్పోర్ట్స్ పాలసీ 2025'ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ'ను ఏర్పాటు చేసింది. ఈ బోర్డు సభ్యురాలిగా కావ్య మారన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది.
స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను నియమించిన ప్రభుత్వం.. కో చైర్మన్ బాధ్యతలను మెగా కోడలు ఉపాసన కామినేనినికి అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బోర్డు సభ్యులుగా కావ్య మారన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్‌గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఈ విధానంలో రాజకీయ జోక్యం తగ్గించాలన్న ఉద్దేశంతోనే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో క్రీడాపాలసీని రూపొందించామని తెలిపారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నకార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న వారిని ఆహ్వానించే ఒక బోర్డును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ పాలసీ తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. 'స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ' రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది క్రీడాకారులు వచ్చేలా కృషి చేస్తుందని చెప్పారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న గొడవల విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీకి అండగా నిలిచారు. హెచ్‌సీఏ బెదిరింపులకు పాల్పడుతుందన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. సమగ్ర విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారుల విచారణలో అక్రమాలు బయటపడటంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుతో పాటు ఆరుగురు అధికారులను సీఐడీ అరెస్ట్ చేసింది. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో చోటు చేసుకున్న ఈ వాగ్వాదం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. హైదరాబాద్‌ను విడిచి వెళ్తామని కూడా సన్‌రైజర్స్ హెచ్చరించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని సన్‌రైజర్స్‌కు అండగా నిలిచారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. కనీసం ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.