For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Chris Woakes: భారత్ నిర్దేశించిన లక్ష్యం కష్టమే.. కానీ గెలుస్తాం!

Chris Woakes says Would Be Incredible Effort To Chase Target Set By India

లండన్‌: నాలుగో టెస్ట్‌లో భారత్ నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అయినప్పటికీ ఇంగ్లండ్ గెలిచితీరుతుందని ఆ జట్టు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ధీమా వ్యక్తం చేశాడు.
గతంలో భారీ లక్ష్యాలను ఛేదించిన అనుభవం తమకు ఉందన్నాడు. నాలుగో రోజు చివర్లో తాము వికెట్‌ నష్టపోకుండా పరుగులు చేశామని గుర్తుచేశాడు. జట్టు సమష్టిగారాణిస్తే నాలుగో టెస్ట్‌లో గెలవడం కష్టమేమీ కాదని చెప్పుకొచ్చాడు. 368 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు హసీబ్‌ హమీద్‌ (43), రోరీ బర్న్స్‌ (31) అజేయంగా నిలిచారు. ఇంగ్లండ్‌ విజయం సాధించాలంటే చివరి రోజు 291 పరుగులు చేయాలి.

రోజంతా బ్యాటింగ్ చేస్తే..

రోజంతా బ్యాటింగ్ చేస్తే..

నాలుగో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన క్రిస్ వోక్స్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'గొప్ప టెస్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏదేమైనా తొలి రెండు రోజులతో పోలిస్తే ఆఖరి రెండు రోజులు టెస్టు క్రికెట్లో ఎక్కువ కష్టపడాలి. మేం ఎక్కువ గంటలు ఫీల్డింగ్‌ చేశాం. అలసిపోయినా మా ఓపెనర్లు అజేయంగా నిలవడం అభినందనీయం. ఆఖరి రోజు కీలకం కానుంది. ఆఖరి రోజు 291 పరుగులు చేయడం కష్టమైన పనే! కానీ వికెట్‌ ఇంకా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని గుర్తుంచుకోవాలి. రోజంతా బ్యాటింగ్‌ చేస్తే మేం గెలవగలం. ఆ నమ్మకం మాకుంది. ఇందుకెంతో శ్రమించాలి.

చేజింగ్ రికార్డు ఉంది..

చేజింగ్ రికార్డు ఉంది..

ఇంగ్లండ్‌ తన సొంతగడ్డపై ఇప్పటి వరకు చేజింగ్ చేసిన హయ్యెస్ట్ స్కోరు 362/9. హెడింగ్లే వేదికగా ఆఖరి వికెట్‌ను కాచుకొని బెన్‌ స్టోక్స్‌ 135 పరుగులతో అజేయంగా నిలవడంతో ఆ విజయం దక్కింది. అతని బ్యాటింగ్‌ యాషెస్‌ సిరీసును మలుపుతిప్పింది. ఇక గతేడాది పాక్‌ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేధించింది. ఈ మ్యాచ్‌లో క్రిస్‌వోక్స్‌ 84తో అజేయంగా నిలిచాడు. ఇవే ఇంగ్లండ్ హయ్యెస్ట్ చేజింగ్ రికార్డులు. ఈ రికార్డుల నేపథ్యంలోనే తమకు భారీ లక్ష్యాలను చేధించిన అనుభవం ఉందని క్రిస్ వోక్స్ చెప్పుకొచ్చాడు.

గెలుస్తామనే నమ్మకం ఉంది..

గెలుస్తామనే నమ్మకం ఉంది..

'మా గత అనుభవాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. జట్టుగా మేమిది చేయగలం. నమ్మకంతో ఆడటమే ముఖ్యం. గతంలో వేర్వేరు ఫార్మాట్లలో ఈ జట్టు అద్భుతాలు చేసింది. పిచ్‌ కాస్త మెరుగ్గా అనిపించడంతో ఫాస్ట్‌ బౌలర్లమైన మేం ఎక్కువగా బంతులు వేయాల్సి వచ్చింది. 45 ప్లస్ ఓవర్లు విసిరాం. వికెట్లు తీసేందుకు శ్రమించాం. చాలామందిమి అలిసిపోయాం. పుంజుకొని సోమవారం బాగా ఆడతామన్న విశ్వాసం ఉంది' అని వోక్స్‌ ధీమా వ్యక్తం చేశాడు.

ఊరిస్తున్న విజయం..

ఊరిస్తున్న విజయం..

ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్‌ (31 బ్యాటింగ్‌), హసీబ్‌ (43 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్‌ ఠాకూర్‌ (72 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 60) వన్డే తరహా ఇన్నింగ్స్‌ ఆడగా... వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (106 బంతుల్లో 4 ఫోర్లతో 50) రాణించాడు. క్రిస్‌ వోక్స్‌ 3 వికెట్లు తీశాడు.

Story first published: Monday, September 6, 2021, 15:50 [IST]
Other articles published on Sep 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+