Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: ప్లీజ్.. మాకు ప్రత్యేక చార్టర్డ్‌ ఫ్లయిట్ ఏర్పాటు చేయండి! వేడుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్!

Chris Lynn urges CA to arrange charter flight for Australia players after IPL 2021
IPL 2021 : CA ని వేడుకున్న Chris Lynn, కుదరదన్న Australia ప్రధాని.. | Oneindia Telugu

చెన్నై: ఆసీస్ ఆటగాళ్లను స్వదేశానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక చార్టర్డ్‌ ఫ్లయిట్ ఏర్పాటు చేయాలని ముంబై ఇండియన్స్‌ స్టార్ ఓపెనర్ క్రిస్‌ లిన్‌.. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను వేడుకున్నాడు. కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021పై పడింది. ఇప్పటికే ఐదు మంది ఆటగాళ్లు ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకోగా.. ఇందులో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లే ఉండడం గమనార్హం. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆండ్రూ టై, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా.. ఇంగ్లండ్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్, టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

చార్టర్డ్‌ ఫ్లయిట్ ఏర్పాటు చేయండి

చార్టర్డ్‌ ఫ్లయిట్ ఏర్పాటు చేయండి

భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన నేపథ్యంలో టోర్నీ ముగిసిన వెంటనే ఆసీస్‌ ఆటగాళ్లు సురక్షితంగా స్వదేశం చేరేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సిందిగా క్రికెట్‌ ఆస్ట్రేలియాను క్రిస్‌ లిన్‌ కోరాడు. 'ఐపీఎల్‌ ఒప్పందంలో భాగంగా సీఏ 10శాతం మొత్తాన్ని చార్టర్డ్‌ విమానం కోసం ఖర్చు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరాను. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని తెలుసు. అయితే మేము కఠిన నియమ నిబంధనలు కలిగిన బబుల్‌లో ఉన్నాం. వచ్చే వారం వ్యాక్సిన్‌ కూడా తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యేక విమానంలో మమ్మల్ని స్వదేశానికి అనుమతిస్తుందని అనుకుంటున్నాం' అని లిన్‌ పేర్కొన్నాడు.

ఆసీస్ ప్రధాని ఏమన్నాడంటే

ఆసీస్ ప్రధాని ఏమన్నాడంటే

ఐపీఎల్‌ 2021 ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్‌ ప్రకటించారు. 'ఐపీఎల్ 2021 కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌కు ప్రైవేట్‌గా వెళ్లారు. అదేమీ ఆస్ట్రేలియా టూర్‌ కాదు. వాళ్లకు సొంత వనరులు ఉన్నాయి. ఆటగాళ్లు వాటిని ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగతంగా ఏర్పాట్లు చేసుకుని వారంతా ఆస్ట్రేలియాకు వస్తారని భావిస్తున్నా' అని ప్రధాని స్కాట్ మోరిసన్‌ ప్రకటించడం విశేషం.

DC vs RCB: తొలి బ్యాట్స్‌మన్‌గా ఏబీ డివిలియర్స్ అరుదై ఘనత!!

బీసీసీఐ హామీ

బీసీసీఐ హామీ

భారత్‌లో వైరస్‌ కరాళనృత్యం చేస్తుండడంతో ఐపీఎల్ లీగ్‌లో అలజడి రేగుతున్నది. మహమ్మారి విజృంభిస్తుండడంతో విదేశీ ఆటగాళ్లు భయపడుతున్నారు. ఇప్పటికే కొందరు ఈ సీజన్‌ నుంచి తప్పుకోగా.. మరికొందరు అదే బాట పట్టాలని భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. మే 30న టోర్నీ ముగిశాక ఆటగాళ్లను వారి స్వదేశాలకు సురక్షితంగా చేరుస్తామని మంగళవారం హామీ ఇచ్చింది. ప్లేయర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నాకే టోర్నీ ముగిసినట్టు అని బీసీసీఐ పేర్కొంది.

Story first published: Wednesday, April 28, 2021, 8:18 [IST]
Other articles published on Apr 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+