Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రాత్రుళ్లు పీడకలలు వెంటాడాయి.. ఇంతకుముందులా ఆడుతానా అని ఆందోళనగా నిద్రలేచేవాడిని'

I had nightmares, What if I don’t have the same cover drive as before: KL Rahul

హైదరాబాద్: కరోనా వైరస్ లాక్‌డౌన్‌ కారణంగా మునుపటిలా ఆడతానో లేదోనని బెంగపడ్డానని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. లాక్‌డౌన్‌లో కొన్ని రాత్రుళ్లు పీడకలలు వెంటాడాయని ఈ కర్ణాటక ఆటగాడు తెలిపాడు. చాలాకాలం తర్వాత బ్యాటు పట్టుకున్న తనకు మొదటి సెషన్‌ ఇబ్బందికరంగా సాగిందని చెప్పాడు. ఇటీవలే ఐపీఎల్‌ 2020 కోసం రాహుల్‌ దుబాయ్‌కి వెళ్లాడు.

రాత్రుళ్లు పీడకలలు వెంటాడాయి:

రాత్రుళ్లు పీడకలలు వెంటాడాయి:

తాజాగా కేఎల్‌ రాహుల్ మాట్లాడుతూ... 'లాక్‌డౌన్‌లో కొన్ని రాత్రుళ్లు పీడకలలు వేధించాయి. ఒక్కోసారి ఆందోళనగా నిద్రలేచేవాడిని. బంతి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను అందిపుచ్చుకోకుంటే ఎలా?, జిడ్డుగా మారితే ఎలా?, ఇంతకుముందులా నా కవర్‌డ్రైవ్‌ అందంగా లేకపోతే ఎలా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఆలోచించేవాడిని. బ్యాట్ పట్టిన తొలి సెషనూ నాకు సాయపడలేదు. దాంతో నా భయాలన్నీ నిజమవుతాయా అని కలవరపడ్డాను. నెట్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్‌ చేశాను. మూడు సెషన్ల తర్వాత సౌకర్యంగా అనిపించింది. దాంతో సంతోషించా' అని అన్నాడు.

ప్రతి సవాల్‌ను ఆస్వాదించా:

ప్రతి సవాల్‌ను ఆస్వాదించా:

ప్రతి సవాల్‌ను ఆస్వాదిస్తానని కేఎల్‌ రాహుల్ చెప్పాడు. తనకు ఏ పాత్రైనా ఫర్వాలేదని పేర్కొన్నాడు. వికెట్‌ కీపింగ్‌ చేయడం తనకు ఎంతో ఇష్టం అని తెలిపాడు. వికెట్ల వెనకాల ఉండి మైదానంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని పేర్కొన్నాడు. 'ఏడెనిమిది నెలలుగా నాకు వచ్చిన ఎదురైన ప్రతి సవాల్‌ను ఆస్వాదించా. వేర్వేరు పాత్రల్లో ఒదిగిపోవడం, బ్యాటింగ్‌లో ఏ స్థానంలోనైనా రావడాన్ని ఆనందించా. జట్టుకు ఏ అవసరం ఉన్నా తీరుస్తాను' అని కేఎల్ రాహుల్‌ చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రాహుల్ ఇప్పటివరకు 36 టెస్టుల్లో, 32 వన్డేల్లో, 42 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ:

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ:

ఐపీఎల్‌ 2020 కోసం కేఎల్ రాహుల్‌ దుబాయ్‌కి వెళ్లాడు. ఈసారి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం రాహుల్‌ దుబాయ్‌లోని హోటల్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. 7 రోజుల్లో మూడుసార్లు వైరస్ పరీక్షలు చేయించుని ప్రాక్టీస్ సెషన్లో పాల్గొననున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదింది లోకేశ్ రాహులే‌. 14 బంతుల్లో రాహుల్ (కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌) ఫిఫ్టీ బాదాడు. ఇక అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వేగవంత‌మైన అర్ధ‌ శ‌త‌కం 12 బంతుల్లో (యువ‌రాజ్ ‌సింగ్ 2007 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్‌పై) న‌మోదైంది.

అతియా శెట్టితో ప్రేమ:

అతియా శెట్టితో ప్రేమ:

కేఎల్ రాహుల్, బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు. అయితే తాజాగా అతియా శెట్టి పోస్ట్‌లకు రాహుల్ స్పందించడంతో వీరీ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉందనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.

Story first published: Tuesday, August 25, 2020, 14:04 [IST]
Other articles published on Aug 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+