For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Chris Gayle ఇప్పుడు 'యూనివర్స్‌ బాస్‌' కాదు.. కారణం ఇదే!

Chris Gayle says ICC don’t want me to use the Universe Boss tag, Im technically the boss

న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను ముద్దుగా యూనివర్స్ బాస్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ ఆడుతూ ఈ విండీస్ వీరుడు అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. దాంతో అతన్ని యూనివర్స్ బాస్‌గా పిలుస్తుంటారు. ఈ ట్యాగ్ ఎవరు ఇవ్వకపోయినప్పటికీ అతనే ప్రకటించుకున్నాడు. అతని బ్యాట్‌ మీద కూడా అలా యూనివర్స్‌ బాస్‌ అనే స్టిక్కర్‌ ఉంటుంది.

కానీ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో మాత్రం గేల్ బ్యాట్‌పై యూనివర్స్ బాస్‌కు బదులు 'ది బాస్'అని రాసుంది. అయితే తాను యూనివర్స్ బాస్‌గా చెలామణి కావడం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్(ఐసీసీ)కి ఇష్టం లేదని మ్యాచ్ అనంతరం గేల్ తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

అందుకే ‘ది బాస్'

ఐసీసీ అభ్యంతరం తెలపడంతోనే యూనివర్స్ బాస్‌ను ది బాస్‌గా మార్చుకున్నానని గేల్ తెలిపాడు. 'నా బ్యాట్‌పై 'ది బాస్‌' అని మాత్రమే ఉంది. ఎందుకంటే నేను యూనివర్స్‌ బాస్‌ అని పిలుచుకోవడం ఐసీసీకి ఇష్టం లేదు. అందుకే దాన్ని కుదించి ది బాస్‌గా పెట్టుకున్నా. నేనే బాస్‌. యూనివర్స్‌ బాస్‌పై ఐసీసీకి కాపీరైట్స్‌ ఉన్నాయి. నేను ముందే చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సాంకేతికంగా క్రికెట్‌లో ఐసీసీయే బాస్‌. వాళ్లతో నేను పనిచేయను. ఐసీసీతో సంబంధం లేదు. బ్యాటింగ్‌లో నేనే బాస్‌.'అని గేల్ బదులిచ్చాడు.

నంబర్స్ వద్దు..

నంబర్స్ వద్దు..

'ఇక నంబర్స్ నేను అస్సలు పట్టించుకోను. మైదానంలో ఇప్పటికీ క్రిస్ గేల్‌ను చూడటానికి మీరంతా ఇష్టపడాలి. క్రిస్ గేల్ అనేవాడు క్రికెట్‌లో సాధ్యమైనంత ఎక్కువ రోజులు ఉంటాడని ఆశిద్దాం. యూనివర్స్ బాస్‌ను గౌరవిస్తూ ఆటను ఆస్వాదించండి. సరదాగా ఆటను ఆస్వాదించే అవకాశం అతనికి ఇవ్వండి.'అని గేల్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో గేల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 ఒకే ఒక్కడు..

ఒకే ఒక్కడు..

ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా వేసిన 9వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన గేల్.. 14 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్ బరిలోకి దిగే యూనివర్స్ బాస్ 431 టీ20 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

ఈ జాబితాలో గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అతనికి దరిదాపుల్లో కూడా మరే ఆటగాడు లేడు. గేల్ సాధించిన ఘనత చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. గేల్ తర్వాత మరో విండీస్ వీరుడు కీరన్ పోలార్డ్ 545 మ్యాచ్‌ల్లో 10836 రన్స్ చేశాడు. షోయబ్ మాలిక్(10,741), డేవిడ్ వార్నర్(10,017), విరాట్ కోహ్లీ (9,235)లు ఉన్నారు.

సిరీస్ విండీస్ కైవసం..

సిరీస్ విండీస్ కైవసం..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (31 బంతుల్లో 2ఫోర్లతో 30), హెన్రిక్స్ ( 29 బంతుల్లో 2 సిక్స్‌లతో 33) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 142 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 14.5 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. క్రిస్ గేల్(38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67), నికోలస్ పూరన్ (32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఫలితంతో విండీస్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

Story first published: Wednesday, July 14, 2021, 12:48 [IST]
Other articles published on Jul 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+