For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు.. అందుకే దూరంగా ఉన్నా: క్రిస్ గేల్

Chris Gayle says I wasnt treated

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరంగా ఉన్న యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నాడు. దాంతో ఈ సీజన్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గేల్.. బయోబబుల్ కారణంగా లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. అయితే తాజాగా ద మిర్రర్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో నాకు సరైన గౌరవం దక్కలేదనిపించింది. ఇన్నేళ్లు క్రికెట్ ఆడి ఎన్నో ఘనతలు అందుకున్న తర్వాత నీకు దక్కాల్సిన కనీస గౌరవం దక్కలేదురా గేల్.. అని నా మనసుతో నేనే అనుకున్నా. అందుకే మెగా వేలానికి ముందు రిటెన్షన్ ప్రక్రియలో నా పేరు లేనప్పుడు కూడా పెద్దగా బాధపడలేదు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితిని నేను ముందే ఊహించా. క్రికెట్ తర్వాత చాలా జీవితం ఉంది. దానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నా.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున నా ప్రయాణం గొప్పగా సాగింది. ఆ జట్టు తరఫున నేను ఎంతో అద్భుతంగా రాణించాను. వచ్చే ఏడాది మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగుతాను. ఆర్‌సీబీ లేదా పంజాబ్ కింగ్స్ తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాను. ఆ రెండు జట్లలోని ఒక టీమ్ తరఫున ఆడి టైటిల్ అందించాలని ఉంది.'అని క్రిస్ గేల్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌ టోర్నీ ఇప్పటి వరకు 142 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్.. 148.96 స్ట్రైక్ రేట్‌తో 4,965 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలతో పాటు 31 హాఫ్ సెంచరీలున్నాయి. పార్టటైమ్ బౌలర్ అయిన గేల్ 18 వికెట్లు కూడా తీసుకున్నాడు. 2013 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడిన క్రిస్ గేల్.. సుడిగాలి ఇన్నింగ్‌ను ఇప్పటికీ ఎవరూ విస్మరించట్లేదు. పుణె వారియర్స్‌పై జరిగిన ఆ మ్యాచ్‌లో 175 పరుగులు చేశాడు. దీన్ని కొట్టే బ్యాటర్ మరొకరు సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు. ఆ మ్యాచ్‌లో గేల్ మొత్తం 17 సిక్సులు బాదాడు. ఐపీఎల్ కెరీర్‌లో 357 సిక్స్‌లు బాదిన గేల్.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు.

Story first published: Saturday, May 7, 2022, 23:35 [IST]
Other articles published on May 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+