For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ గేల్ సూపర్ డైవ్.. ఓరి నీ ఏషాలో అనుకుంటూ పడి పడి నవ్విన రస్సెల్! (వీడియో)

Chris Gayle’s diving attempt leaves Andre Russell in splits in PBKS vs KKR match

అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్- పంజాబ్ కింగ్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ బ్యాటింగ్‌లో విఫలమైనా ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. 41 ఏళ్ల వయసులోనూ తన మైమరిపించే ఫీల్డింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే రాహుల్ త్రిపాఠి ఆడిన ఓ షాట్‌‌ను ఆపేందుకు క్రిస్ గేల్ పడ్డ కష్టంను చూసి డగౌట్‌లో ఉన్న అతని సహచర ఆటగాడు, కేకేఆర్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ పడి పడి నవ్వుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అసలేం జరిగిందంటే..?

కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా క్రిస్ జోర్డాన్ వేసిన 8వ ఓవర్‌లో ఫుల్లర్ డెలివరీని రాహుల్ త్రిపాఠి మిడ్ వికెట్ మీదుగా ఫ్లిక్ షాట్ ఆడాడు. అయితే ఆ బంతిని ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ గేల్ సూపర్ డైవ్‌తో అడ్డుకున్నాడు. గేల్ డైవ్ చేయకుంటే అది ఖచ్చితంగా బౌండరీ వెళ్లేది. ఇక గేల్ సూపర్ ఫీల్డింగ్ పంజాబ్ ఆటగాళ్లంతా ప్రశంసించగా.. డగౌట్‌లో కూర్చున్న రస్సెల్ ముసి ముసి నవ్వుకున్నాడు. అతన్ని టీవీ కెమరాలు ఫోకస్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ వీడియోపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నాడు. గేల్ తిప్పలు చూసి రస్సెల్‌కు నవ్వాగలేదని ఒకరంటే.. ఓరి నీ ఏషాలో అని అనుకున్నట్లున్నాడని మరొకరు కామెంట్ చేశారు.

త్రిపాఠికి గుండెపోటు తెప్పించాడు..

త్రిపాఠికి గుండెపోటు తెప్పించాడు..

ఇక ఇదే కాకుండా సూపర్ త్రోతో రాహుల్ త్రిపాఠికి గుండెపోటు తెప్పించాడు. అతని ధాటికి దాదాపు ఔటని భావించిన త్రిపాఠి చివరి క్షణంలో డైవ్ చేయడంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా గేల్ మైదానంలో తన ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. 41 ఏళ్ల వయసులో కూడా యువ ఆటగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో రాణిస్తున్న గేల్‌పై కామెంటేటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. అందుకే అతను యూనివర్స్ బాస్ అంటూ కొనియాడారు.

కేకేఆర్‌కు ఉపశమన విజయం..

కేకేఆర్‌కు ఉపశమన విజయం..

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (34 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... చివర్లో క్రిస్‌ జోర్డాన్‌ (18 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ప్రసిధ్‌ కృష్ణ (3/ 30), సునీల్‌ నరైన్‌ (2/22), కమిన్స్‌ (2/31) ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కళ్లెం వేశారు. అనంతరం ఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలుపొందింది. మోర్గాన్‌ (40 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు , 2 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (32 బంతుల్లో 41; 7 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Story first published: Tuesday, April 27, 2021, 18:19 [IST]
Other articles published on Apr 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+