నేనే అత్యుత్తమ స్పిన్నర్.. నా ముందు మురళీధరన్ జుజుబీ: క్రిస్ గేల్

న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ప్రపంచంలో తనను మించిన స్పిన్నర్ లేడని, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ తన ముందు జుజుబీ అని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ ఆడిన క్రిస్ గేల్ అందరివాడన్న విషయం తెలిసిందే. మైదానంలో తనదైన చర్యతో అభిమానుల అలరించేందుకు ప్రాధాన్యత ఇస్తాడు. జట్టు ఓటమి దిశగా సాగుతున్నా.. అతని ముఖంపై మాత్రం చిరనవ్వు చెరగదు. అంతటి సరదాగా ఉండే గిల్.. మరోసారి తనదైన ఫన్నీ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం యూనివర్స్ బాస్ కరీబియన్ దీవులలో జరగబోయే సరికొత్త టోర్నీ 'సిక్స్‌టీ' లీగ్‌కు సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీ టీ10 ఫార్మాట్‌లో జరగనుంది.
ఈ లీగ్ బుధవారం(ఆగస్టు 24) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్స్ బాస్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పేట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పిన గేల్.. ఈ టోర్నీలో బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా రాణించాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టాడు. అదే విధంగా ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు తనే అత్యత్తుమ స్పిన్నర్‌నని చెప్పుకొచ్చాడు.
'నా బౌలింగ్ సహజమైనది. నేను కచ్చితంగా ఈ టోర్నీలో బౌలింగ్ చేస్తాను. మీకు తెలుసా..? ప్రపంచ క్రికెట్‌లో నేనే ఇప్పటి వరకు గ్రేట్ స్పిన్నర్‌ని. ముత్తయ్య మురళీధరన్ కూడా నాలా బౌలింగ్ చేయలేకపోయాడు. అతని కంటే నేను తక్కువ ఎకనామీతో బౌలింగ్ చేశాను. అదేవిధంగా సునీల్ నరైన్ కూడా నా దగ్గరకు రాలేడు" అని గేల్ సరదాగా వాఖ్యనించాడు.
'మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టేందుకు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉండడంతో ఇది నా అరంగేట్ర మ్యాచ్‌గా భావిస్తున్నాను. ఈ టోర్నీతో మళ్లీ నా రిథమ్‌ను తిరిగి పొందుతాను. ఈ టోర్నీ నన్ను మరికొంత కాలం క్రికెట్ ఆడేలా సహాయపడుతుందని భావిస్తున్నా"అని యూనివర్స్ బాస్ గేల్ పేర్కొన్నాడు. కాగా గేల్ చివరగా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications