Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చహల్ చిరాకు తెప్పిస్తున్నావ్.. నిన్ను బ్లాక్ చేస్తున్నా: క్రిస్ గేల్

Chris Gayle brutally trolls Yuzvendra Chahal

హైదరాబాద్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సోషల్ మీడియా వేదికగా చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇప్పటికే టిక్‌టాక్ వీడియోలతో హాట్ టాపిక్‌గా మారిన ఈ స్టార్ ప్లేయర్.. ఫన్నీ కామెంట్స్‌తో సహచర ఆటగాళ్లను ట్రోల్ చేస్తుంటాడు. తాజాగా ఇలానే ఆటపట్టించబోయి వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఆగ్రహానికి గురయ్యాడు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో గేల్ మాట్లాడుతూ.. చహల్ తింగరేషాలపై గేల్ అసహనం వ్యక్తం చేశాడు. మళ్లీ అతన్ని చూడనని బ్లాక్ చేస్తున్నట్లు తెలిపాడు. 'చహల్‌.. నిన్ను బ్యాన్‌ చేయాలని టిక్‌టాక్‌ను కోరుతా.. నువ్వు సోషల్‌మీడియాలో చాలా చిరాకు తెప్పిస్తున్నావు. అసలు ఉన్నపళంగా నువ్వు సోషల్‌మీడియాను వదిలేయి. నిన్ను భరించలేకపోతున్నాం. నిన్ను మళ్లీ నా జీవితంలో చూడను. అందుకే బ్లాక్ చేస్తున్నా'అని గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇక మాజీ ఆర్సీబీ ప్లేయరైన గేల్‌తో చహల్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఈ యువ స్పిన్నర్ సోషల్ మీడియాలో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నాడు. ముఖ్యంగా టిక్‌టాక్ వీడియోలతో హల్‌చల్ చేస్తూ.. సహచర క్రికెటర్లను ట్రోల్ చేస్తున్నాడు.

ఇక తన సహచర ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, డివిలియర్స్ కూడా ఇన్‌స్టా లైవ్ సెషన్ సందర్భంగా చహల్ గురించి మాట్లాడుతూ.. అతని టిక్ టాక్ వీడియోల గురించే చర్చించారు. చహల్ టిక్‌టాక్ వీడియోలు చూస్తే.. అతను ఓ అంతర్జాతీయ క్రికెటరని, 29 ఏళ్ల వయసున్న వ్యక్తని అస్సలు అనుకోవని డివిలియర్స్‌కు కోహ్లీ తెలిపాడు. ఇంటికే పరిమితమైన చాలా మంది క్రికెటర్లు ఇన్‌స్టా లైవ్ సెషన్స్‌లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.

Story first published: Sunday, April 26, 2020, 13:54 [IST]
Other articles published on Apr 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+