Chris Gayle: ఐపీఎల్‌కు యూనివర్స్ బాస్ దూరం.. ఆ జిగేల్స్ లేనట్లే!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఈ ధనాధన్ లీగ్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న ఈ విండీస్ వీరుడు.. తనదైన విధ్వంసంతో ఈ క్యాచ్ రిచ్ లీగ్‌కు కళ తీసుకొచ్చాడు. అలాంటి గేల్ ఈ సీజన్‌కు దూరంగా ఉండటం, వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం అభిమానులను నిరాశపరుస్తుంది. క్రికెటర్లంతా మెగా వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకునే గడువు (జనవరి 20)శుక్రవారంతో ముగియడంతో ఆ వివరాలను ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.

1214 మంది రిజిస్ట్రేషన్..
మెగా వేలం కోసం 1,214 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. 270 మంది క్యాప్‌డ్ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్‌క్యాప్‌డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్ ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. విదేశీయుల్లో అత్యధికంగా ఆస్ట్రేలియాకు చెందిన 59 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

గేల్‌తో పాటు..
ఇక యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తన పేరును నమోదు చేసుకోలేదు. ఏబీ డివిలియర్స్ అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో అతను కూడా ఈ సీజన్‌కు అందుబాటులో లేడు. దాంతో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సారే ఈ ఇద్దరు ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక గేల్ దూరమవ్వడంపై క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

చప్పట్లతో అభినందించాలి..
‘ఐపీఎల్‌కు ఇంతటి క్రేజ్ రావడానికి గేల్ కూడా ఓ కారణం. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ అందించిన సేవలకు నిలబడి, చప్పట్లతో అభినందించాల్సిందే...' అని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌లో ఓ శకం ముగిసిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక బయో బబుల్స్ వాతావరణంతో విసిగిపోయిన క్రిస్ గేల్.. ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే వెళ్లిపోయాడు. కెరీర్‌లో మొత్తం 142 మ్యాచ్‌లు ఆడిన గేల్..39.72 సగటుతో 4965 పరుగులు చేశాడు. ఇందులో 31 హాఫ్ సెంచరీలతో 6 సెంచరీలున్నాయి.

ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం..
క్రిస్ గేల్‌తో పాటు నలుగురు విదేశీ క్రికెటర్లు టోర్నీకి దూరమయ్యారు. ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల యాషెస్ టెస్టు సిరీస్‌ను 0-4తో చేజార్చుకున్న ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. టీ20 లీగ్స్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టి.. టెస్టులని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ఓటమి ఎదురైందని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. దాంతో.. ఇంగ్లండ్ టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్, అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్.. తాము ఐపీఎల్ 2022కి దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇదే బాటలో ఆ దేశానికి చెందిన అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ కూడా తాను ఐపీఎల్ 2022 ఆడనని తెలిపాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్ 2022లో ఆడబోవట్లేదని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications