Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs PBKS: సిక్సర్ల క్రిస్‌ గేల్ అరుదైన ఘనత.. ఐపీఎల్‌ చరిత్రలోనే ఫస్ట్ బ్యాట్స్‌మన్‌గా రికార్డ్!

 Chris Gayle becomes first batsman to record 350 sixes in IPL history

ముంబై: పంజాబ్ కింగ్స్ విధ్వసంకర వీరుడు, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచిన యూనివర్స్ బాస్ తాజాగా.. ఈ క్యాష్ రిష్ లీగ్‌లో 350 సిక్స్ మార్క్‌ను అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

బెన్ స్టోక్స్ వేసిన 8వ ఓవర్ మూడో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్, గేల్‌కు ఇదే మొదటి సిక్స్ కావడం విశేషం. ఇక సిక్సర్ల జాబితాలో గేల్ టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ 237 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌ టీ20 కెరీర్‌లో గేల్.. 1009 సిక్స్‌లు బాదాడు. ఈ ఘనతను అందుకున్న ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌ల్లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేసిన గేల్‌ను రియాన్ పరాగ్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బౌలర్ ఎవరా? అనేది సంబంధం లేకుండా చుక్కలు చూపిస్తున్నాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేయడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

Story first published: Monday, April 12, 2021, 21:07 [IST]
Other articles published on Apr 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+