Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli vs Rohit: దిగజారిన అభిమానం.. పుట్టిన రోజు జుగుప్సాకరమైన ట్రోలింగ్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు(నవంబర్ 5) 36వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతనికి అభిమానులు, సహచర, మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అతను సాధించిన ఘనతలు, రికార్డులను నెమరువేసుకుంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

కానీ కొందరు అభిమానులు మాత్రం కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా కూడా జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అభిమానులను రెచ్చగొట్టేలా 'CHOKLI BLACK DAY'అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

CHOKLI BLACK DAY trends Virat Kohli brutally trolled by Rohit Sharma fans on his birthday

రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌మని చెప్పుకుంటున్న కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా కింగ్ కోహ్లీని టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆర్‌సీబీ ఇంకా ఐపీఎల్ టైటిల్ గెలవలేదనే విషయాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. మహిళల టీమ్ మాత్రమే విజేతగా నిలవడంతో.. కోహ్లీకి చీరకట్టిన మార్ఫింగ్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ధోనీ ముందు కోహ్లీ పిల్ల బచ్చా అని కామెంట్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆర్‌సీబీ సంచలన విజయాన్నందుకొని ప్లే ఆఫ్స్ చేరింది. ఈ విజయాన్ని ఆర్‌సీబీ జట్టు.. అభిమానులు టైటిల్ గెలిచినంత సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంబరాలను చెన్నై అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఈ సంబరాలను మనసులో పెట్టుకున్న కొందరు అభిమానులు అతన్ని బర్త్ డే సందర్భంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

కెప్టెన్‌గా కోహ్లీ సాధించిందేం లేదని, ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ కంటే రోహిత్ వెయ్యి రెట్లు నయమని ట్రోలింగ్‌కు దిగారు. కోహ్లీ ఓ కుక్క అంటూ కూడా జుగుప్సాకరమైన రీతిలో అతనిపై తనకున్న అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఈ ట్రోలింగ్‌ను విరాట్ కోహ్లీ అభిమానులు తిప్పికొడుతున్నారు.

దాంతో సోషల్ మీడియా వేదికగా కోహ్లీ X రోహిత్ ఫ్యాన్స్ మధ్య యుద్దం జరుగుతోంది. కోహ్లీ ఆడిన కీలక ఇన్నింగ్స్ వల్లనే టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిందని, రోహిత్ శర్మ చేసిందేం లేదని మండిపడుతున్నారు. కోహ్లీ సక్సెస్‌ను చూసి ఓర్వలేక ట్రోలింగ్‌కు దిగుతున్నారని, వెయ్యి జన్మలెత్తినా.. కోహ్లీ రికార్డులను రోహిత్ అధిగమించలేడని కామెంట్ చేస్తున్నారు.

ఆటగాళ్లుగా కోహ్లీ, రోహిత్ బాగానే ఉన్నా.. అభిమానం పేరిట దిగజారడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ ముసుగులో భారత స్టార్ క్రికెటర్‌ను తిడుతున్నామనే సోయి కూడా లేకుండా పోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు.

Story first published: Tuesday, November 5, 2024, 12:21 [IST]
Other articles published on Nov 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+