Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ మ్యాచ్ కోసమే చిన్నస్వామిలో చెలరేగుతున్నాం: రజత్ పాటిదార్

ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలోనే జరగనుందని, దాంతోనే హోమ్ గ్రౌండ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలవాలనే కసితో ఉన్నామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో తమ వరుస విజయాల వెనుక చాలా ప్రణాళిక ఉందని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన రజత్ పాటిదార్.. టాస్ ఓడినా తాము కోరుకున్నదే దక్కిందన్నాడు. టాస్ గెలిచినా తాము బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. 'ముందుగా బ్యాటింగ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పిచ్‌పై మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఇది పగటిపూట జరిగే మ్యాచ్. పిచ్ బాగున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి మేం బోర్డుపై ఒక మంచి స్కోరును ఉంచి, వారిని ఒత్తిడిలోకి నెట్టాలని భావిస్తున్నాం.

అందుకే గ్రీన్ జెర్సీ..

పర్యావరణ పరిరక్షణ పట్ల మా నిబద్ధతను చాటిచెప్పడానికి, అందరూ పర్యావరణ హితమైన ఎంపికలు చేసుకునేలా ప్రోత్సహించడానికి మేం ఈ గ్రీన్ జెర్సీని ధరిస్తాము. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. చిన్నస్వామి స్టేడియంలో మెరుగైన ప్రదర్శన చేయడం వెనుక పెద్ద ప్రణాళిక ఉంది. ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలోనే జరగనుంది. దాంతోనే మేం హోమ్ గ్రౌండ్‌లో జరిగే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నాం.'అని రజత్ పాటిదార్ తెలిపాడు.

Chinnaswamy Goal Rajat Patidar Emphasizes Home Dominance Ahead of IPL 2026 Final
Photo Credit: IPL (X)

అందుకే బౌలింగ్ ఎంచుకున్నా..

మరోవైపు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ చూడటానికి చాలా బాగుంది. హార్డ్‌గా కనిపిస్తోంది. ఇది పగటిపూట జరిగే మ్యాచ్ కాబట్టి, పిచ్ కొంచెం నెమ్మదించే అవకాశం ఉంది. అలాగే, చిన్నస్వామి స్టేడియం సాధారణంగా ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది, అందుకే మేం మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. మేం అదే ఎలెవన్‌తో బరిలోకి దిగుతున్నాం.

గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత సుదీర్ఘ విరామం లభించింది. ఇది మేం పుంజుకోవడానికి సహాయపడింది. కొత్త ఉత్సాహంతో మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉన్నాం. మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసే ప్రయత్నం చేస్తాం. 'అని అక్షర్ పటేల్ తెలిపాడు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆర్‌సీబీ ప్రతీ ఏటా ఓ మ్యాచ్‌ను గ్రీన్ జెర్సీలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఈ మ్యాచ్‌లోనే గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగింది.

తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్:

పాథుమ్ నిస్సంక, KL రాహుల్ (కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఆకిబ్ నబీ దార్, లుంగీ ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్.

Story first published: Saturday, April 18, 2026, 15:39 [IST]
Other articles published on Apr 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+