మరో ఆప్షన్ లేదు..
ఇక ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్ లభ్యం కావడం ఇంచుమించు అసాధ్యమని బోర్డు అభిప్రాయపడింది. దీంతోనే వివోను స్పాన్సర్ కొనసాగించడం అనివార్యమైందని పేర్కొంది. ఈ నిర్ణయం ఏ మాత్రం భారత ప్రజలకు మింగుడుపడటం లేదు. ఓ వైపు డ్రాగన్ కంట్రీ ఆర్మీ మన జవాన్ల ప్రాణాలు తీస్తుంటే.. బీసీసీఐ ఏమో ఆ దేశ కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే పనిలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రోజుకో యాష్ ట్యాగ్ ట్రెండ్..
ఈ నేపథ్యంలో సోమవారం #BoycottIPL ట్యాగ్‌ను ట్రెండ్ చేసిన నెటిజన్లు.. మంగళవారం #ChinesePremierLeague ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ‘ఆత్మనిర్భర్‌లో భాగంగా భారత ప్రజలు చైనీస్ ఉత్పత్తులను బహిష్కరిస్తుంటే.. మన జవాన్లను పొట్టన పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ కంపెనీని ఐపీఎల్ స్పాన్సర్‌గా కొనసాగించడం బీసీసీఐకి ఎంతవరకు సమంజసం. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు చైనీస్ ప్రీమియర్ లీగ్?'అని కామెంట్ చేస్తున్నారు.‘సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి మనతో కనీసం చర్చలు జరపడానికి కూడా డ్రాగన్ కంట్రీ ముందుకు రావడం లేదు. కానీ మనం మాత్రం ఐపీఎల్ పేరిట చైనా కంపెనీల స్పాన్సర్ మధ్య సంబరాలు జరుపుకుంటున్నాం. దీన్ని చైనీస్ ప్రీమియర్ లీగ్ అని పిలవడం ఉత్తమం'అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

మనకే లాభం..
చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు ఓ సందర్భంలో బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సమాధానమిచ్చారు. ‘వివో' వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్‌లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది.

పన్నుల రూపంలో..
అదే చైనా కంపెనీ వారి బ్రాండ్ ప్రమోషన్ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది. అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్ స్పాన్సర్ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే' అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు.


Click it and Unblock the Notifications












