టీమిండియాలో అతనే నిలకడైన ఆటగాడు: కోహ్లీ చిన్ననాటి కోచ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియాలోనే కోహ్లీ అత్యంత నిలకడగా రాణించే ఆటగాడని కొనియాడాడు. వన్డే ప్రపంచకప్ 2027కు విరాట్ కోహ్లీ సిద్దంగా ఉన్నాడని స్పష్టం చేశాడు.
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బుధవారం బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సెలెన్స్ మైదానం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ శతకంతో చెలరేగాడు. 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 పరుగులు చేసాడు. గత ఐదు వన్డే మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీకి ఇది మూడో శతకం కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ శతకంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్రేక్షకుల్లేకుండానే..
అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ నయా రూల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌కు కర్ణాటక ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు మృతి చెందడంతో ప్రేక్షకుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. దాంతో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ నిర్వహించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రికీ భుయ్(105 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 122) సెంచరీతో రాణించగా.. నితీష్ రెడ్డి(23)తీవ్రంగా నిరాశపర్చాడు. అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లకు 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) సెంచరీతో చెలరేగగా.. ప్రియాన్ష్ ఆర్య(74), నితీష్ రాణా(77) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.
ప్రపంచకప్‌కు రెడీ..
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై సంతోషం వ్యక్తం చేసిన రాజ్‌కుమార్ శర్మ.. అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడని చెప్పాడు. 'విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను అసాధారణ బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినా.. అద్భుతంగా రాణించాడు. భారత జట్టులోనే అతను అత్యంత నిలకడైన ఆటగాడు. వన్డే ప్రపంచకప్‌కు కోహ్లీ అన్ని విధాల సిద్దంగా ఉన్నాడు.'అని ఏఎన్‌ఐతో రాజ్‌కుమార్ శర్మ అన్నాడు.
#WATCH | Rajkot, Gujarat | On Virat Kohli's return to the Vijay Hazare Trophy for Delhi and scoring a century against Andhra Pradesh, Virat Kohli's childhood coach Rajkumar Sharma says, "He is in brilliant form. He batted very well and ensured Delhi’s victory. He played domestic… pic.twitter.com/XXkY1nsaBr
— ANI (@ANI) December 24, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications