అతని ఫిట్‌నెస్ చరిత్ర తెలిసే జట్టులోకి తీసుకోలేదు: ఎమ్మెస్కే ప్రసాద్


హైదరాబాద్: వెస్టిండీస్‌తో ఆడేందుకు టీమిండియాలో స్థానం కల్పించలేదని మరో క్రికెటర్ సెలక్టర్లపై దుమ్మెత్తిపోస్తున్నాడు. విండీస్‌తో మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని గురువారం సెలక్టర్లు ప్రకటించగా.. కేదార్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై సెలక్టర్లు కనీసం తనతో మాట్లాడలేదని ఆవేదన వెల్లగక్కాడు. తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేలకు సెలక్టర్లు తనను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదని కేదార్ జాదవ్ అన్నాడు.
ఎందుకు ఎంపిక కాలేదో నాకు తెలియదు
ఎంపిక కాకపోవడంపై విలేకర్లు ప్రశ్నించగా.. ‘ఎందుకు ఎంపిక కాలేదో నాకు తెలియదు. ఈ విషయం మొదట నాకు చెబుతున్నది మీరే. నన్నెందుకు ఎంపిక చేయాలేదో నేను కూడా తెలుసుకోవాలి. ఇక నేను రంజీ మ్యాచ్‌లు ఆడతానేమో' అని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్లో తొడ కండరాలు పట్టేయడంతో జాదవ్ చికిత్స తీసుకున్నాడు.
కోహ్లీ 2018 ట్రాక్ రికార్డు ఇదే.. అన్నింటిలోనూ విరాటే బెస్ట్!!

నేను నిజాలు మాత్రమే చెబుతాను
'గాయంతో వైదొలిగిన నేను పూర్తి ఫిట్‌నెస్ సాధించి మ్యాచ్‌లాడుతున్నా. నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిట్ అని సర్టిఫై చేశాక.. ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలి. గాయాలెప్పుడు అవుతాయో ఎవరికీ తెలియదు. ఫిజియో, ట్రైనర్లకు నేను నిజాలు మాత్రమే చెబుతాను. వారి నుంచి ఫిట్‌నెస్ విషయాలు దాచాలని భావించనని' చెప్పుకొచ్చాడు.

ఫిట్‌నెస్ చరిత్రను దృష్టిలో ఉంచుకునే
ఈ విషయంపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా స్పందించాడు. జాదవ్ పునరాగమనంపై తాము నిర్ణయం తీసుకోవాలంటే అతడు మరిన్ని దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరముందని అన్నాడు. ‘జాదవ్ ఫిట్‌నెస్ చరిత్రను దృష్టిలో ఉంచుకునే అతణ్ని ఎంపిక చేయలేదు. ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులోకి వచ్చి వెంటనే గాయపడ్డ సందర్భాలున్నాయి. ఇటీవల ఆసియాకప్ అందుకో ఉదాహరణ' అని ప్రసాద్ చెప్పాడు.

సెలక్టర్లు తమను సంప్రదించలేదని
ఇటీవల వెస్టిండీస్‌లో టెస్ట్ సిరీస్‌కు జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు తమను సంప్రదించలేదని కరుణ్ నాయర్, మురళీ విజయ్ ఆరోపించారు. వారితో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామంటూ ఈ ఇద్దరు ఆటగాళ్ల ఆరోపణల్ని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. పుణె వేదికగా శనివారం వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడనున్న టీమిండియా, 29న ముంబై వేదికగా 4వ వన్డే, నవంబరు 1న తిరువనంతపురం వేదికగా చివరి వన్డే ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications