For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Cheteshwar Pujara: 93 ఏళ్లలో ఒకే ఒక్కడు!

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్ట్‌లు ఆడి 43 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 278 మ్యాచ్‌లు ఆడిన పుజారా 51 సగటుతో 21,301 పరుగుల చేశాడు. ఇందులో 68 సెంచరీ‌లతో పాటు 81 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, పంజాబ్‌, సీఎస్‌కే‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్‌సీబీ, పంజాబ్ తరఫున 22 ఇన్నింగ్స్‌ల్లో 390 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌‌లో టీమిండియా నెంబర్ 3 బ్యాటర్‌గా అనేక రికార్డ్స్ సృష్టించాడు. 2023‌లో భారత జట్టుకు దూరమైన పుజారా.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేదు. ఈ సమయంలో భారత నెంబర్ 3 ఆటగాడిగా అనేక మంది ఆడినా.. ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. ఇదే పుజారా విలువ ఏంటో తెలియజేస్తోంది.

Cheteshwar Pujara s Unbreakable Record The Only Indian to Face 500 Balls in a Test Innings

93 ఏళ్లలో ఒకే ఒక్కడు

టెస్ట్ క్రికెట్‌లో పుజారా ఆరుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను, రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్‌ను గెలుచుకున్నాడు. 2006లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లోనూ పుజారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. 2013లో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, 2018లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అంతేకాకుండా భారత క్రికెట్ చరిత్రలోనే ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 500 బంతులు ఎదుర్కొన్న ఏకైక ఆటగాడిగా కూడా పుజారా చరిత్ర సృష్టించాడు.


సచిన్, గవాస్కర్‌కు సాధ్యం కానీ రికార్డ్..

సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలకు సాధ్యం కానీ రికార్డ్ అందుకున్నాడు. అంతేకాకుండా గత 40 ఏళ్లలో టెస్ట్ క్రికెట్‌లో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన తొలి భారత ఆటగాడిగా కూడా పుజారా చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా(సెనా) దేశాలపై అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన భారత ఆటగాడిగా కూడా పుజారా ఘనతను అందుకున్నాడు.

బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో పుజారా మాత్రమే 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా పుజారా కూడా ఈ జాబితాలో చేరాడు. అజింక్యా రహానే ఒక్కడే మిగిలాడు. అతను కూడా తప్పుకుంటే టెస్ట్‌ల్లో ఓ శకం ముగుస్తోంది.

Story first published: Sunday, August 24, 2025, 14:12 [IST]
Other articles published on Aug 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+