IND vs ENG: చతేశ్వర్ పుజారా చెత్త రికార్డు.. మళ్లీ అండర్సన్ బౌలింగ్‌లోనే ఔట్!

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ వైఫల్యం కొనసాగుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(11), కేఎల్ రాహుల్(17) దారుణంగా విఫలమవ్వగా.. ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్, నయావాల్ చతేశ్వర్ పుజారా సైతం(4) చేతులెత్తేసాడు. జేమ్స్ అండర్సన్ వేసిన అదే ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌కు కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరి మూల్యం చెల్లించుకున్నాడు.
మూడో టెస్ట్ ఫస్ట్ ఇనింగ్స్‌లో జిమ్మీ బౌలింగ్‌లో ఎలా ఔటయ్యాడో.. తాజా మ్యాచ్‌లోనూ అలానే వెనుదిరిగాడు. గత మ్యాచ్‌లో చేసిన తప్పిదాన్ని పుజారా ఏమాత్రం సరిదిద్దుకోలేకపోయాడు. దాంతో 30 బంతులాడినా..క్రీజులో కుదురుకులేకపోయాడు. క్యాచ్ అందుకున్న ఒక కీపర్ మారాడే తప్పా పుజారా ఔట్ విషయంలో మిగతాదంతా సేమ్ టూ సేమ్ జరిగింది.

పుజారా2
ఈ ఔట్‌తో పుజారా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో అత్యధికసార్లు ఔటైన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. జిమ్మీ బౌలింగ్‌లో ఇప్పటి వరకు పుజారా 11 సార్లు ఔటయ్యాడు. ఈ జాబితాలో భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ 12 సార్లతో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ 10 సార్లు అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఈ సిరీస్ ముగిసేసరికి భారత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమిస్తారని అభిమానులు సెటైర్లు పేల్చుతారు.

ఇంగ్లండ్‌దే ఆధిపత్యం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లంచ్ విరామ సమయానికి 25 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 54 రన్స్ చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లతో 18 బ్యాటింగ్), రవీంద్ర జడేజా(19 బంతుల్లో 2 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్ చెరొక వికెట్ తీశారు. బౌలర్లు చెలరేగడంతో ఫస్ట్ సెషన్ మొత్తం ఇంగ్లండే ఆధిపత్యం చెలాయించింది.

నో అశ్విన్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఇరు జట్లలో రెండేసి మార్పులు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ ఉద్వాసనకు గురవ్వగా.. శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది.
ఇంగ్లండ్ జట్టులో సామ్ కరన్, జోస్ బట్లర్ స్థానాల్లో ఓలీ పోప్, క్రిస్ వోక్స్ చోటు దక్కించుకున్నారు. ఇక బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తన ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మను పెవిలియన్ చేర్చాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో క్రీజులో కుదురుకుంటున్న హిట్ మ్యాన్‌ను బొల్తా కొట్టించాడు. దాంతో 28 రన్స్‌కే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పుజారా క్రీజులోకి రాగా.. ఆ వెంటనే కేఎల్ రాహుల్ రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

రాహుల్ కూడా
రాబిన్సన్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను తప్పుగా అంచనా వేసిన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. పుజారా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. జిడ్డు బ్యాటింగ్‌తో ఇక క్రీజులో పాతుకుపోతున్న పుజారాను అండర్సన్ తనదైన బౌలింగ్‌తో బోల్తాకొట్టించాడు. దాంతో టీమిండియా మేనేజ్‌మెంట్ లెఫ్టాండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇస్తూ బ్యాటింగ్ పంపించింది.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఫస్ట్ సెషన్ ముగించారు. ఇక కోహ్లీ స్వేచ్చగా ఆడుతూ రిథమ్ అందుకునే ప్రయత్నం చేశాడు. మూడు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొత్తానికి భారత్ అదే తడబాటుతో కష్టాలు కొని తెచ్చుకుంది. మ్యాచ్‌లు నిలవాలంటే.. ఈ జోడీ భారీ భాగస్వామ్యం నెలకొల్పడం చాలా కీలకం. కనీసం సెకండ్ సెష్ మొత్తం ఆడాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications