Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మానవ్ సుతార్.. ఐపీఎల్‌కు దూరంగా ఉండు: మాజీ క్రికెటర్

టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌కు మాజీ టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కీలక సూచన చేశాడు. ఐపీఎల్ ఆడవద్దని సలహా ఇచ్చాడు. ఐపీఎల్ కారణంగా మానవ్ సుతారా సహజ ప్రతిభ దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించాడు.

శ్రీలంకతో తొలి టెస్ట్‌లో టీమిండియా 165 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మానవ్ సుతార్ (4/76, 6/55) పది వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌తో అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన మానవ్ సుతార్ రెండు మ్యాచ్‌ల్లోనే 17 వికెట్లు పడగొట్టి టీమిండియా కీలక బౌలర్‌గా ఎదిగాడు.

తాజాగా సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ షోలో మాట్లాడిన పుజారా.. టెస్ట్‌ల కోసం మానవ్ సుతార్‌ను కాపాడాలని బీసీసీఐకి సూచించాడు.ఐపీఎల్‌కు దూరంగా ఉంచాలని చెప్పాడు. ఒకవేళ మానవ్ సుతార్ ఐపీఎల్ ఆడినా.. తన బౌలింగ్ శైలిని ఏ మాత్రం మార్చుకోవద్దని సూచించాడు.

Cheteshwar Pujara Urges Manav Suthar to Focus on Red-Ball Cricket Instead of Chasing IPL Contract

'టెస్ట్ ఫార్మాట్ కోసం మానవ్ సుతార్‌ను కాపాడండి.యువ ఆటగాళ్లంతా టీ20 ఫార్మాట్ ఆడాలని కోరుకుంటారు. కానీ మానవ్ సుతార్‌ను టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్‌గా తీర్చిదిద్దేందుకు టీమిండియా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంపై గతంలో కూడా మాట్లాడుకున్నాం. మానవ్ సుతార్‌కు ఐపీఎల్ ఆడాలని ఉండొచ్చు. కానీ ఆవైపు వెళ్లకపోవడమే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే.. ఐపీఎల్ ఆడే అవకాశం వస్తే పర్లేదు. కానీ దాని కోసం అసలు బలాన్ని మార్చుకోవద్దు.

మానవ్ సుతార్ తన బౌలింగ్‌ను మార్చుకోవాల్సిన అసరమే లేదు. వైట్‌బాల్ క్రికెట్‌లో తక్కువ ఎత్తుతో వేగంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అతను ఐపీఎల్ ఆడటంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఐపీఎల్ ఆడి అక్కడ విజయం సాధిస్తే మంచిదే. కానీ ప్రాథమిక బలాన్ని మాత్రం మార్చుకోకూడదు.

మానవ్ సుతార్ ఫ్లైట్ ఇస్తూ, కాస్త నెమ్మదిగా బౌలింగ్ చేసేందుకు ఇష్టపడుతాడు. రెడ్ బాట్ క్రికెట్‌లో దీనిని మార్చుకోవాల్సి అవసరం లేదు. కేవలం ఐపీఎల్ కోసం ఈ బౌలింగ్ శైలిని మార్చుకోవద్దు ఆ వేలం వెర్రి నేను అర్థం చేసుకోగలను. కానీ బంతికి ఫ్లైట్ ఇచ్చే నీ సహజసిద్ధమైన నైపుణ్యాన్ని మాత్రం అస్సలు మార్చుకోవద్దు.'అని పూజారా సూచించాడు.

Story first published: Thursday, August 20, 2026, 15:10 [IST]
Other articles published on Aug 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+