లక్ష్యం చిన్నదే అయినా.. గెలిచే అవకాశాలున్నాయి: పుజారా

ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియాకు గెలిచే అవకాశాలున్నాయని స్టార్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా అన్నాడు. ప్రత్యర్థి ముందు తాము విధించిన లక్ష్యం చిన్నదే అయినా.. గట్టిగా ప్రయత్నిస్తే ఈ కఠిన పిచ్‌పై దాన్ని కాపాడుకోవచ్చని చెప్పాడు. బ్యాటర్లంతా విఫలమైన వికెట్‌పై చతేశ్వర్ పుజారా (142 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 59) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన పుజారా తన ఇన్నింగ్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ పిచ్‌పై గెలవచ్చు
'ఇది కఠినమైన పిచ్. ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. డిఫెన్స్‌ను నమ్ముకోవడంతో పాటు బంతి పిచ్ అవ్వడాన్ని, లెంగ్త్‌ను సరిగ్గా అంచనా వేసి ఆడాలి. మేం విధించిన లక్ష్యం సరిపోదని నాకు తెలుసు. కానీ ఈ వికెట్‌పై ఆ లక్ష్యాన్ని కాపాడుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఈ పిచ్‌పై పూర్తిగా డిఫెన్స్ చేద్దామన్నా కుదరదు. అనూహ్య బౌన్స్ ఉండటంతో బంతి గ్లోవ్స్‌కు తాకి క్యాచ్‌గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి డిఫెన్స్‌తో పాటు అటాకింగ్ గేమ్ కూడా ఆడాలి. ఈ రెండు సమన్వయం చేసుకుంటేనే ఈ పిచ్‌పై రాణించగలం. నేను ఈ ఫార్మూలాతోనే ఆడాను. లూజ్ బాల్స్‌ను గట్టిగా కొట్టాను. నాథన్ లయన్ లైన్ చేంజ్ చేస్తూ బౌలింగ్ చేశాడు. ఆఫస్టంప్ లైన్ కంటే మిడిల్, లెగ్ స్టంప్ దిశగా బంతులు సంధించాడు.

పిచ్ స్లోగా ఉండటంతో..
స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతని బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. స్క్వేర్ లెగ్ దిశగా ఆడాలనుకున్న షాట్.. పిచ్ స్లోగా ఉండటంతో లెగ్ స్లిప్‌గా వెళ్లింది. స్మిత్ అద్భుతంగా అందుకున్నాడు. ఔటవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసింది. అక్షర్‌తో జోడించిన విధంగా.. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే మెరుగైన స్థితిలో ఉండేవాళ్లం. కొన్ని షాట్లను నేర్చుకోవడంపై నేను ఫోకస్ పెట్టా. క్విక్ రన్స్ చేయాల్సిన పరిస్థితుల్లో అవి ఉపయోగపడతాయని, వాటిపై వర్క్ చేస్తున్నా. జట్టు అవసరాలకు తగ్గట్లు భారీ షాట్స్ ఆడగలననే ఆత్మవిశ్వాసం నాకు ఉంది.'అని పుజారా చెప్పుకొచ్చాడు.

భారత్ 163 ఆలౌట్..
89 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 60.3 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. చతేశ్వర్ పుజారా(142 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 59) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. నాథన్ లయన్(8/64) ఎనిమిది వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నేమన్ తలో వికెట్ తీసారు. తొలి సెషన్ మినహా రెండు సెషన్లలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

ఆసీస్ లక్ష్యం 76
అంతకుముందు 156/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా.. అశ్విన్(3/44), ఉమేశ్ యాదవ్(3/12) ధాటికి 197 పరుగులకు కుప్పకూలింది. 11 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు చివరి 6 వికెట్లను కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా(60), మార్నస్ లబుషేన్(31), కామెరూన్ గ్రీన్(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. మూడో రోజు ఆటలో భారత స్పిన్నర్లు అద్భుతం చేస్తే తప్పా రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications