Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Cheteshwar Pujara: సెంచరీ చేయక చాలా రోజులైంది.. ఈసారి కచ్చితంగా సాధిస్తా

Cheteshwar Pujara says ‘Rahane and I will hit centuries soon’

కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సెంచరీ సాధిస్తానని టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అన్నాడు. సెంచరీ చేయక చాలా రోజులు అవుతుందని, ఈసారి కచ్చితంగా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఈ సిరీస్‌లో నిర్భయంగా ఆడాలనకుంటున్నాడు తెలిపాడు.

ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌ పర్యటనలోనూ ఇలాగే ఆడానని చెప్పిన పుజారా... ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో ఉండటం వల్ల మంచి టచ్‌లో ఉన్నానని చెప్పాడు. గురువారం నుంచి కాన్పూర్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పుజారా మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

ఇదే తొలి సారి..

ఇదే తొలి సారి..

'నా టెస్ట్ కెరీర్‌లో సెంచరీకి ఇంత సమయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ మధ్యన ఆడిన మ్యాచ్‌ల్లో 50-60 పరుగులు సాధిస్తున్నాను. ఈ సారి కచ్చితంగా సెంచరీ కొట్టేందుకు ప్రయత్నిస్తా. సెంచరీ చేయకున్నా.. 50, 80, 90 పరుగులు సాధించా. జట్టుకు ఉపయోగపడే పరుగులు సాధించడమే అసలైన సంతృప్తి. అది నేను చేస్తున్నా.

అలాంటప్పుడు శతకాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కివీస్‌తో టెస్టు సిరీస్‌ స్వదేశంలో ఆడనుండడం సానుకూలాంశం. పిచ్‌ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి. ఒక్క మంచి ఇన్నింగ్స్‌తో నిలబడితే చాలు. ఇక బ్యాటింగ్‌ టెక్నిక్‌లో పెద్దగా మార్పులు ఏం లేవు. నిర్భయంగా ఆడాలని నిర్ణయించుకున్నా.

రహానే సైతం..

రహానే సైతం..

అజింక్యా రహానే విషయంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రతీ ఆటగాడికి గడ్డుకాలం అనేది కచ్చితంగా ఉంటుంది. రహానే ఎంత గొప్ప ఆటగాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రహానే ఆటలో ప్రస్తుతం ఎత్తుపల్లాలు ఉన్నాయి. కానీ అతనిపై నాకు నమ్మకముంది. అతని కష్టపడే తత్వమే పరుగులు వచ్చేలా చేస్తాయి. రహానే ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్‌ చాలు. ఒక్కసారి లయ అందుకున్నాడంటే వెనుదిరిగి చూడనవసరం లేదు.

నిర్భయంగా ఆడటమే..

నిర్భయంగా ఆడటమే..

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నా ఆలోచనా విధానం మరోలా ఉంది. అప్పుడు నేను ఏమాత్రం భయంలేకుండా ఆడాను. అప్పుడు నా బ్యాటింగ్‌లో చేసుకున్న టెక్నికల్‌ మార్పులేమీ లేవు. ఇక రాబోయే న్యూజిలాండ్‌ సిరీస్‌కు నా సన్నద్ధం బాగుంది. ఇంగ్లండ్‌లో భయంలేకుండా ఎలా ఆడానో ఈ సిరీస్‌లోనూ అదే విధంగా ఆడాలనుకుంటున్నా.

ఐపీఎల్‌లో భాగస్వామి అయినందుకు బ్యాటింగ్ పరంగా మంచి టచ్‌లోనే ఉన్నా.'అని పుజారా చెప్పుకొచ్చాడు. ఇక 2019- 2021 మధ్య కాలంలో టెస్టులో 9 అర్థసెంచరీలు చేసిన పుజారా.. అందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై టీమిండియా సిరీస్‌లు నెగ్గడం విశేషం. ఓవరాల్‌గా ఇప్పటివరకు పుజారా టీమిండియా తరపున 90 టెస్టుల్లో 6494 పరుగులు చేయగా.. ఇందులో 18 సెంచరీలు.. 31 అర్థసెంచరీలు ఉన్నాయి.

Story first published: Tuesday, November 23, 2021, 18:12 [IST]
Other articles published on Nov 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+