Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగు వేళ్ల‌తోనే బ్యాట్ ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది.. అయినా ఎలాగోలా ఆడాను: పుజారా

Cheteshwar Pujara said I had to grip the bat with four fingers

ముంబై: ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన గబ్బా టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌నిప‌ట్టి గ‌బ్బా కోట‌ను బ‌ద్ధ‌లు కొట్టింది. గబ్బా టెస్ట్‌లో 89 ప‌రుగులు ఇన్నింగ్స్‌తో రిష‌బ్ పంత్ హీరో అయ్యాడు. 91 ప‌రుగులు చేసిన శుభ్‌మ‌న్ గిల్ క్రెడిట్ అందుకున్నాడు‌. అయితే మ‌ధ్య‌లో జట్టును గ‌ట్టెక్కించాల‌న్న దృఢ సంక‌ల్పంతో ఆస్ట్రేలియా బౌల‌ర్ల బౌన్స‌ర్ల‌కు త‌న శ‌రీరాన్ని అడ్డుపెట్టి బ్యాటింగ్ చేసిన నయావాల్ చెటేశ్వ‌ర్ పుజారాకు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు.

211 బంతులు ఆడి 56 పరుగులు:

211 బంతులు ఆడి 56 పరుగులు:

ఆఖరి టెస్ట్‌లో చెటేశ్వ‌ర్ పుజారా దాదాపు ఐదు గంటల పాటు క్రీజులో ఉండి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తమ సహనానికి పరీక్షగా నిలిచిన పుజారాను ఆసీస్ బౌలర్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చెక్కు చెదరకుండా ఆడాడు. షాట్ బాల్స్ పదేపదే గాయపరిచే ప్రయత్నం చేసినా.. నొప్పిని భరిస్తూ ఆటను కొనసాగించాడు. పుజారా గ్లోవ్స్, బాడీ, హెల్మెట్‌కు అదేపనిగా బంతులు తగిలినా ఏమాత్రం బెదరలేదు. క్రీజులో ఉంటూ యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. 211 బంతులు ఆడి 56 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలో అత‌ని శ‌రీరం మొత్తం గాయాల‌య్యాయి. అయితే త‌న వేలికి త‌గిలిన గాయం మాత్రం చాలా తీవ్ర‌మైంద‌ని తాజాగా పుజారా చెప్పాడు.

నాలుగు వేళ్ల‌తోనే బ్యాట్ ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది:

నాలుగు వేళ్ల‌తోనే బ్యాట్ ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది:

హిందూస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెటేశ్వ‌ర్ పుజారా మాట్లాడుతూ... 'మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో నా చేతి వేలికి గాయ‌మైంది. దీని కార‌ణంగా సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టు‌ల‌లో బ్యాటింగ్ చేయడానికి చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. బ్రిస్బేన్‌లో మ‌ళ్లీ అక్క‌డే దెబ్బ త‌గ‌ల‌డంతో గాయం మ‌రింత తీవ్ర‌మైంది. ఆ త‌ర్వాత క‌నీసం బ్యాట్ ప‌ట్టుకోవ‌డానికి కూడా రాలేదు. నాలుగు వేళ్ల‌తోనే బ్యాట్‌ను గ్రిప్ చేయాల్సి వ‌చ్చింది. అయినా ఎలాగోలా ఆడాను' అని తెలిపాడు.

 వికెట్ పారేసుకోవ‌డం క‌రెక్ట్ కాదు:

వికెట్ పారేసుకోవ‌డం క‌రెక్ట్ కాదు:

బౌన్స‌ర్ల‌ను త‌ప్పించుకోవ‌డానికి పుల్‌షాట్ల‌ను ఎందుకు ఆడ‌లేదో కూడా నయావాల్ చెటేశ్వ‌ర్ పుజారా చెప్పాడు. త‌న పుల్‌షాట్ అంత మెరుగ్గా ఉండ‌ద‌ని, పైగా ఆ స‌మ‌యంలో ఆ షాట్ ఆడ‌బోయి వికెట్ పారేసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని అనిపించిన‌ట్లు పుజారా తెలిపాడు. పుల్‌షాట్లలో రెండు బౌండరీలు బాదడం కన్నా.. నా వికెట్‌కు ఎక్కువ విలువ ఉందని తాను గ్రహించానని చెప్పాడు. ఆ సమయంలో ధాటిగా పరుగులు చేయడం కంటే.. వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చానని పుజారా చెప్పుకొచ్చాడు.

2018-19 టూర్‌లో కూడా:

2018-19 టూర్‌లో కూడా:

ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో కనీసం 200 బంతులు ఎదుర్కొన్న రెండో బ్యాట్స్‌మెన్‌గా చతేశ్వర్ పుజారా నిలిచాడు. గతంలో ఇంగ్లాండ్‌కి చెందిన బాయ్‌కాట్ (1970-71) మాత్రమే ఈ ఘనతని సాధించాడు. తాజా పర్యటనలో మాత్రమే కాదు.. 2018-19 ఆస్ట్రేలియా టూర్‌లో కూడా పుజారా అదరగొట్టాడు. పుజారాతో పాటు బుమ్రా కూడా సత్తాచాటడంతో అప్పుడు కోహ్లీసేన ఆసీస్‌ను చిత్తుచేసింది. ఇక ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు చెన్నై చేరుకోని క్వారంటైన్‌లో ఉన్నారు.

పంత్.. ఈ ప్రశ్న అడగడానికి! కోహ్లీ, రోహిత్‌కు కూడా ఇంత ధైర్యం ఉండదు!

Story first published: Thursday, January 28, 2021, 17:02 [IST]
Other articles published on Jan 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+