న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రంజీ ఫైనల్: పుజారా రిటైర్డ్ హర్ట్.. కష్టాల్లో సౌరాష్ట్ర

Cheteshwar Pujara retires hurt as Bengal take honours on Day 1 against Saurashtra in Ranji Trophy Final

రాజ్‌కోట్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా భావించిన సౌరాష్ట్ర జట్టుకు నిరాశే ఎదురైంది. బెంగాల్ జట్టుతో సోమవారం ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన పుజారా(5) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫలితంగా తొలి రోజు ఆటలో బెంగాల్ పై చేయి సాధించింది.

సౌరాష్ట్ర 206/5..

సౌరాష్ట్ర 206/5..

వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 80.5 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. క్రీజులో అర్పిత్ వసవడ(29 బ్యాటింగ్) ఉన్నాడు. ఇక సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో అవి బరోట్(54), విశ్వరాజ్ జడేజా(54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. హర్విక్ దేశాయ్(38), షేల్డన్ జాక్సన్(14), చేతన్ సకరియ(4) విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ (3/41) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ పొరెల్, శభాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

ఓపెనర్ల శుభారంభం..

ఓపెనర్ల శుభారంభం..

అంతకు మందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్లు హర్విక్ దేశాయ్(38), అవి బరోట్(54) శుభారంభాన్ని అందించారు. క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీనీ శభాజ్ అహ్మద్ హర్విక్ దేశాయ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి విడదీశాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

చెలరేగిన ఆకాష్..

చెలరేగిన ఆకాష్..

అనంతరం క్రీజులోకి వచ్చిన విశ్వరాజ్ జడేజాతో మరో ఓపెనర్ అవి బరోట్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతన్ని ఆకాష్ దీప్ ఔట్ చేశాడు. తర్వాత అర్పిత్ వసవాడతో కలిసి విశ్వరాజ్ జడేజా ఆచితూచి ఆడాడు. మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించిన అనంతరం విశ్వరాజ్‌ను ఆకాష్ దీప్ బౌల్డ్ చేశాడు. తర్వాత జాక్సన్‌ను పొరెల్ ఔట్ చేయగా.. అస్వస్థతకు గురైన పుజారా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే చేతన్ సకరియ కూడా ఔటవ్వడంతో 206 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి సౌరాష్ట్ర కష్టాల్లో పడింది. ఈ వికెట్ అనంతరం అంపైర్లు తొలి రోజు ఆటను నిలిపివేశారు.

Story first published: Monday, March 9, 2020, 20:02 [IST]
Other articles published on Mar 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X