For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ 2021లో ఆడే ఛాన్స్ ఇవ్వండి.. నేనేంటో నిరూపించుకుంటా: పుజారా

Cheteshwar Pujara hopes to play in IPL again
IPL 2021: Cheteshwar Pujara Hopes To Play In The IPL Again

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీమిండియా క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తెలిపాడు. తన ఆటతీరుపై నమ్మకముందని, ఆడే చాన్స్‌ ఇస్తే మాత్రం కచ్చితంగా నిరూపించుకుంటా అని పేర్కొన్నాడు. నిజానికి పుజారా అరంగేట్రం చేసిన కొత్తలో టెస్టులతో పాటు వన్డేలు కూడా ఆడాడు. అయితే నెమ్మదైన బ్యాటింగ్‌ కారణంగా కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిమితమయ్యాడు. పుజారా చివరిగా 2014లో ఐపీఎల్‌‌లో ఆడాడు. ఆ తర్వాత ఏటా వేలంలోకి వేలంలోకి రావడం, చివరికి అమ్ముడుపోని క్రికెటర్‌గా నిలవడం పరిపాటిగా మారిపోయింది.

పుజారా పాత్ర మరువలేనిది:

పుజారా పాత్ర మరువలేనిది:

ఆసీస్‌ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌ గెలవడంలో​ చతేశ్వర్‌ పుజారా పాత్ర మరువలేనిది. ఆసీస్‌ పేసర్ల బౌన్సర్లు అతని శరీరాన్ని గాయపరిచినా వాటిని లెక్కచేయకుండా ఇన్నింగ్స్‌లు ఆడడం పుజారాకే చెల్లింది. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు 200కు పైగా బంతులను ఎదుర్కొని 65 పరుగులే చేసినా.. అతను ఆడిన ఇన్నింగ్స్‌ టీమిండియాను విజయంవైపు నడిపించింది. ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ విజయానంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పుజారాను ఓ జాతీయ మీడియా ఇంటర్యూ చేసింది. ఆ ఇంటర్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌ 2021లో ఆడతా:

ఐపీఎల్‌ 2021లో ఆడతా:

అవకాశమిస్తే ఐపీఎల్‌ 2021లో ఆడతారా అన్న ప్రశ్నకు పుజారా ఇలా స్పందించాడు. 'కచ్చితంగా ఆడతా. ఐపీఎల్‌లో ఆడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఐపీఎల్‌ ఆడేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. ఈసారి జరిగే వేలంలో నన్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినా.. వారికి పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా.టెస్ట్‌ క్రికెటర్‌గా ముద్రపడిన నాకు ఏ ఫార్మాట్లో ఎంత వేగంగా ఆడాలన్న దానిపై ఓ క్లారిటీ ఉంది. ఒక అవకాశమిస్తే నన్ను నేను నిరూపించకుంటా. నాకు ఆ నమ్మకముంది' అని తెలిపాడు. పుజారా టీ20 క్రికెట్‌లో ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. అయితే ఆ మెరుపు ఇన్నింగ్స్‌ని ఎవరూ గుర్తుంచుకోలేదు.

2014లో చివరగా ఆడాడు:

2014లో చివరగా ఆడాడు:

2008 నుంచి ఐపీఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి సీజన్‌లో చతేశ్వర్ పుజారాని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఓ మూడేళ్ల తర్వాత 2011లో వేలానికి పుజారాని కోల్‌కతా వదిలేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ దక్కించుకుంది. ఆర్సీబీ కూడా మూడేళ్ల తర్వాత వేలంలోకి పుజారాని వదిలేసింది. ఇక 2014లో పుజారానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. ఆ ఏడాది తర్వాతే వేలంలోకి అతడిని వదిలేసింది. ఆ తర్వాత 2015 నుంచి పుజారాని ఏ ప్రాంచైజీ కోనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2020 సీజన్ వేలానికి రూ.50 లక్షలు కనీస ధరతో వచ్చిన పుజారాని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2021 సీజన్ ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరగనుంది. ఈసారైనా ఎవరైనా దక్కించుకుంటారో చూడాలి.

తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదు:

తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదు:

రానున్న ఇంగ్లండ్‌ సిరీస్‌ను తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని పుజారా స్పష్టం చేశాడు. 'ఈ టెస్ట్‌ సిరీస్‌ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో ఏ జట్టు మొదట ఫైనల్‌ చేరుతుందనేది ఈ సిరీస్‌తో తేలిపోనుంది. పైగా ఇంగ్లండ్‌ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. లంకను వారి స్వదేశంలో క్లీన్‌స్వీప్‌ చేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారికి మన దేశంలో కూడా మంచి రికార్డు ఉంది. తొలి టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.

87ఏళ్ల తర్వాత తొలిసారి.. ఈసారి రంజీ ట్రోఫీ లేదు!!

Story first published: Saturday, January 30, 2021, 20:22 [IST]
Other articles published on Jan 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+