Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

145 బంతుల్లో ఒక్క బౌండరీ లేదు.. టెస్ట్ క్రికెట్‌ అంటే ఏంటో చూపించిన నయా వాల్!!

Cheteshwar Pujara faced Most balls in Test cricket v Australia in the past decade

అడిలైడ్‌ :టెస్టు మ్యాచ్‌ అంటేనే బ్యాట్స్‌మన్‌కు ఎంతో ఓపిక అవసరం. సుదీర్ఘ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్‌ తమ ఇన్నింగ్స్‌ను నత్తనడకన సాగిస్తూ.. బౌలర్లకు చిరాకు తెప్పిస్తూ.. పరుగులు చేస్తుంటారు. కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్లు ఆడే జిడ్డు ఇన్నింగ్స్‌లే జట్టును ఓటమి నుంచి గట్టెక్కింస్తుంటాయి. టీమిండియా క్రికెట్‌లో మాజీ ఓపెనర్ సునీల్‌ గవాస్కర్‌ తర్వాత జిడ్డు క్రికెట్‌కు పెట్టింది పేరు మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌. ద్రవిడ్‌ తన 16 ఏళ్ల కెరీర్‌లో టెస్టు క్రికెట్‌లో డిఫెన్స్‌ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పాడు. తన జిడ్డు ఇన్నింగ్స్‌లతో ఎన్నో విజయాలు, మరెన్నోసార్లు జట్టును ఓటమి నుంచి కూడా తప్పించాడు. అందుకే 'ది వాల్'' అనే బిరుదు సంపాదించాడు. ద్రవిడ్‌ తరహాలోనే టీమిండియాకు మరో వాల్‌గా తయారయ్యాడు చటేశ్వర్‌ పుజారా.

పుజారా మార్క్:

పుజారా మార్క్:

టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన చటేశ్వర్‌ పుజారా అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు. అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అదే సమయంలో ఓటమి నుంచి కూడా జట్టును బయటపడేశాడు. సహచర బ్యాట్స్‌మన్‌ పెవిలియన్ చేరినా.. ఒంటరిగా పోరాటం చేస్తూ జట్టుకు విలువైన పరుగులు చేశాడు. తాజాగా అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులోనూ పుజారా తన మార్క్ చూపించాడు. పుజారా ఇన్నింగ్స్‌ చూస్తే ఎవరికైనా మతిపోతుంది. టెస్టు క్రికెట్‌ అంటే ఎలా ఉంటుందో ఆసీస్‌ ఆటగాళ్లకు చూపించాడు.

 145 బంతుల్లో ఒక్క బౌండరీ లేదు:

145 బంతుల్లో ఒక్క బౌండరీ లేదు:

స్కోరుబోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదవ్వకుండానే ఓపెనర్‌ పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన చటేశ్వర్‌ పుజారా ఎంతో ఓపికగా ఆడాడు. 145 బంతుల ఎదుర్కొని ఒక్క బౌండరీ కూడా లేకుండా 30 పరుగులు చేశాడు. బహుశా తన కెరీర్లో అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్‌ ఇదే కావడం విశేషం. అయితే ఇలా ఆడడంలో పుజారా తప్పు లేదు. పిచ్‌ పరిస్థితి బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో నత్తనడకన ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి జట్టును ఆదుకున్నాడు. చివరకు 160 బంతుల్లో రెండు బౌండరీల సాయంతో 43 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.

ద్రవిడ్‌ గోడ కన్నా బలంగా ఉంటుంది:

ద్రవిడ్‌ గోడ కన్నా బలంగా ఉంటుంది:

అయితే చటేశ్వర్‌ పుజారా ఆటతీరుపై సోషల్‌ మీడియాలో ఫన్నీ ట్రోల్స్‌ వస్తున్నాయి. 'అసలైన టెస్టు క్రికెటర్‌ అంటే పుజారానే' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'మా పుజారా సిమెంట్..‌ అంబుజా సిమెంట్‌ కంటే దృడంగా ఉంటుంది' అని మరొకరు ట్వీటారు. 'పుజారా కట్టే గోడ.. ద్రవిడ్‌ గోడ కన్నా బలంగా ఉంటుంది', 'ద్రవిడ్‌ తర్వాత మాకు మరో వాల్‌ దొరికాడు' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు పుజారా ఆడిన ఇన్నింగ్స్‌పై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తొలిరోజు ముగిసేసరికి భారత్ 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. క్రీజులో సాహా (9), అశ్విన్ (15) ఉన్నారు.

అత్యధిక బంతులు:

అత్యధిక బంతులు:

అత్యధిక బంతులు:

గత దశాబ్దంలో ఆస్ట్రేలియాపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడి జాబితాలో చటేశ్వర్‌ పుజారా మొదటి స్థానంలో ఉన్నాడు. పుజారా 28 ఇన్నింగ్స్‌లలో 3609 బంతులు ఆడాడు. 46 ఇన్నింగ్స్‌లలో జో రూట్ 3607 బంతులు ఎదుర్కొన్నాడు. అలిస్టర్ కుక్ 40 ఇన్నింగ్స్‌లలో 3274 బంతులు, 35 ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ 3115 బంతులు ఆడాడు.

విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు.. ఒక్క మైదానంలోనే!!

Story first published: Thursday, December 17, 2020, 17:42 [IST]
Other articles published on Dec 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+