విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఒక్క మైదానంలోనే!!

అడిలైడ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న రన్‌మెషీన్.. తన టెస్టు కెరీర్‌లో అడిలైడ్ ఓవల్ మైదానంలోనే అత్యధిక రన్స్ సాధించాడు. ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులో విరాట్ ఈ ఫీట్ అందుకున్నాడు. అడిలైడ్ మైదానంలో కోహ్లీ 500 పరుగులను పూర్తిచేసుకున్నాడు. దీంతో అడిలైడ్ ఓవల్‌లో టెస్ట్ క్రికెట్‌లో 500 పరుగులు పూర్తి చేసిన 4వ నాన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా విరాట్ రికార్డుల్లోకి ఎక్కాడు.
సాధారణంగా ఏ ఆటగాడైనా అలవాటైన స్వదేశీ పిచ్‌లపై ఎక్కువ పరుగులు చేస్తుంటారు. అయితే అందరికన్నా భిన్నంగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ విదేశీ గడ్డపై ఒకే మైదానంలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేయడం విశేషం. గులాబి టెస్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. అచ్చొచ్చిన మైదానంలో భారీ స్కోరు చేయాలనే పట్టుదలతో విరాట్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివరకు అజింక్య రహానేతో సమన్వయ లోపం కారణంగా 74 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
ఒకే స్టేడియంలో కోహ్లీ అత్యధిక పరుగులు:
500-అడిలైడ్ ఓవల్ (ఆస్ట్రేలియా)
467-అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
433-వాంఖడే స్టేడియం (ముంబై)
379-రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)
354-విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (నాగ్‌పూర్)
ఓవల్ మైదానంలో కోహ్లీ చేసిన పరుగులు:
116
22
115
141
3
34
74
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications