
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టెస్టు స్పెషలిస్టు, నయావాల్ చతేశ్వర్ పుజారా పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌ను వెనక్కినెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో జిడ్డు బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పుజారా 760 రేటింగ్ పాయింట్స్‌తో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ స్థానంలో 755 రేటింగ్ పాయింట్లతో ఉన్న బాబర్ ఆజామ్‌ను అధిగమించి ఆరో స్థానంలో నిలిచాడు.
ఇక భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(748) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఎనిమిదో ర్యాంక్ సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(862) పాయింట్లతో నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (919) పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్(891) రెండు, మార్నస్ లబుషేన్(878) మూడు ర్యాంకుల్లో ఉన్నారు. మరోవైపు బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్(908) పాయింట్లతో అగ్రస్థానంలోనే నిలవగా, భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ (760) ఎనిమిది, జస్‌ప్రీత్ బుమ్రా (757) తొమ్మిది ర్యాంకులు సాధించారు.
కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రాతో పాటు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె మెరుగైన ప్రదర్శన చేశారు. ఈ సీనియర్లకు కొత్త ఆటగాళ్లు కూడా తోడవ్వడంతో భారత్ ఆసీస్‌పై రెండోసారి చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే.