For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాపం చేతన్ శర్మ.. ఓటీటీ వెబ్ సిరీస్ కోసమని చెప్పి ఇరికించేసారు!

Chetan Sharma got lured into a sting operation in grab of big OTT Project of Indian Cricket

న్యూఢిల్లీ: భారత క్రికెట్ చీకటి బాగోతాలను బయటపెట్టిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ‌ను పథకం ప్రకారమే బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తోంది.జీ న్యూస్, వియాన్ వెబ్‌సైట్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ సంచలన విషయాలు బయటపెట్టిన విషయం తెలిసిందే.

పూర్తి స్థాయి ఫిట్‌నెస్ కోసం భారత ఆటగాళ్లు డోపింగ్‌లో పట్టుబడని ఇంజెక్షన్లు ఉపయోగిస్తారని, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని, రోహిత్ శర్మ టీ20 కెరీర్ ముగిసిందని చేతన్ శర్మ చెప్పడం తీవ్ర దుమారం రేపింది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ నేపథ్యంలో తప్పు చేశానని భావించిన చేతన్ శర్మ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తోంది.

ఓటీటీ వెబ్ సిరీస్ కోసమని..

ఓటీటీ వెబ్ సిరీస్ కోసమని..

అయితే జీ న్యూస్, వియాన్ రిపోర్టర్లు చేతన్ శర్మను పథకం ప్రకారమే ఇరికించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నామని చేతన్ శర్మను సంప్రదించినట్లు సమాచారం. 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ సిరీస్‌కు కథను సిద్దం చేస్తున్నామని, దానికి ఇన్‌పుట్స్ కావాలని చేతన్ శర్మను కోరినట్లు తెలుస్తోంది. అమెజాన్ వేదికగా విడుదలైన 'ఇన్‌సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్‌లానే ఇది ఉంటుందని, ఎవరీ పేర్లను ఇందులో ప్రస్తావించమని నమ్మించినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.

షేర్ ఇస్తామని చెప్పడంతో..

షేర్ ఇస్తామని చెప్పడంతో..

సదరు వ్యక్తులు ఎంతా చెప్పినా చేతన్ శర్మ అంగీకరించలేదని, దగ్గరకు కూడా రాణించలేదంట. వారు జర్నలిస్ట్‌లు అనే విషయం కూడా చేతన్‌కు తెలియదంట. పలు మార్లు కలిసినా చేతన్ శర్మ వారికి సరైన రెస్పాన్స్ ఇవ్వలేదట. అయితే బీసీసీఐ పెద్దల సపోర్ట్ కూడా తమకు ఉందని, వారు కూడా కొన్ని విషయాలు మాతో ఆఫ్ ద రికార్డు షేర్ చేసుకున్నారని తెలిపారంట. బీసీసీఐ పెద్దలు చెప్పిన కొన్ని సీక్రేట్స్‌ను చేతన్ శర్మకు చెప్పడంతో అతను వారిని నమ్మి ఆఫ్ ద రికార్డు చెప్పడానికి అంగీకరించాడట. వెబ్ సిరీస్ ద్వారా వచ్చే ఆదాయంలో షేర్ కూడా ఇస్తామని చెప్పడంతో చేతన్ శర్మ ఓపెన్ అయినట్లు తెలుస్తోంది.

సంచలన విషయాలు వెల్లడించి..

సంచలన విషయాలు వెల్లడించి..

చేతన్ శర్మ వారిని పూర్తిగా నమ్మిన తర్వాత స్పై కెమెరాలతో అతను చెప్పిన మాటలను ఇద్దరు రిపోర్టర్లు రికార్డు చేశారంట. వెబ్ సిరీస్ స్టోరీ కోసం చేతన్‌ను కోహ్లీ- గంగూలీ మధ్య విభేదాలు, ఆటగాళ్ల ఫిట్నెస్, టీమిండియాకు కొత్త కెప్టెన్, రోహిత్ -కోహ్లీల మధ్య గొడవలు అనే సున్నితమైన ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. వీటికి చేతన్ శర్మ ముందు వెనుక చూసుకోక గుడ్డిగా నమ్మి అన్ని బయటపెట్టేశాడు. ఆ సమయంలో అతను ఆల్కహాల్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2023 షెడ్యూల్‌తో కవరింగ్..

ఐపీఎల్ 2023 షెడ్యూల్‌తో కవరింగ్..

జై షా అండదండలతో రెండో సారి చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన చేతన్ శర్మ.. అతనికి ముఖం చూపించలేక రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జై షా అంటే గిట్టని వర్గమే.. చేతన్ శర్మను ఇరికించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది జర్నలిస్ట్‌లు కాదని తెలుస్తోంది. స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆ వీడియోలను సదరు చాన్సెల్‌కు అమ్ముకున్నట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఏది ఏమైనా.. ఈ వ్యవహారంతో బోర్డు ప్రతిష్ట దెబ్బతినడంతో బీసీసీఐ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే హడావుడిగా ఐపీఎల్ 2023 సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించి.. చర్చను పక్కదారి పట్టించింది. అది కూడా స్టార్ స్పోర్ట్స్ ద్వారా ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Story first published: Sunday, February 19, 2023, 9:34 [IST]
Other articles published on Feb 19, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+