Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: ఐపీఎల్ డబ్బుతో.. నా కుటుంబం కోసం ఇల్లు కొనాలనుకుంటున్నా: చేతన్‌

Chetan Sakariya says I want to buy a house for my family with Rajasthan Royals IPL contract

రాజ్‌కోట్: గత నెల చెన్నైలో జరిగిన ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో యువ క్రికెటర్‌ చేతన్‌ సకారియాను అదృష్టం వరించిన విషయం తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన చేతన్‌ను రూ 1.2 కోట్లు పెట్టి రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్)‌ కొనుగోలు చేసింది. మొదటగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బిడ్డింగ్‌ మొదలు పెట్టినా.. చివరకు ఆర్‌ఆర్ దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా చేతన్‌ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. ఏప్రిల్‌ 9 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చేతన్‌ పలు అంశాలు పంచుకున్నాడు.

 కాస్త భయం వేసింది:

కాస్త భయం వేసింది:

'విజయ్‌ హజారే ట్రోఫీలో సందర్భంగా ప్రాక్టీసు ముగించుకుని బస్సులో హోటల్‌కు వెళుతున్నాం. అదే సమయంలో వేలం జరుగుతోంది. అవీ బరోట్‌ను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నాకు కాస్త భయం వేసింది. నన్ను ఎవరైనా కొనుగోలు చేస్తారా? లేదా? అనే సందేహం మొదలైంది. ఆ వెంటనే బెంగళూరు నా కోసం బిడ్డింగ్‌ మొదలు పెట్టింది. రాజస్తాన్‌ కూడా పోటీకి వచ్చింది. చివరకు 1.2 కోట్లు పెట్టి నన్ను కొనుగోలు చేసింది. అప్పుడు నా చుట్టూ ఉన్న జట్టు సభ్యులంతా బస్సులోనే సంబరాలు చేశారు. సంతోషంతో కేకలు వేశారు' అని చేతన్‌ సకారియా తెలిపాడు.

ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్నారు:

ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్నారు:

'13 ఏళ్ల వయసు నుంచి ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడటం ఆరంభించాను. అంతకుముందు టెన్నిస్‌ బాల్‌ టోర్నమెంట్లు ఆడేవాడిని. అయితే నా తల్లిదండ్రులు మాత్రం ముందు చదువుపై శ్రద్ద పెట్టు.. ఆ తర్వాతే ఆటలు అని చెప్పేవారు. నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది వారి కోరిక. కానీ నాకు మాత్రం క్రికెట్‌ అంటే పిచ్చి. పరీక్షల సమయంలో కూడా క్రికెట్‌ ఆడేవాడిని. అండర్‌- 16 జట్టుకు నేను ఎంపికైన తర్వాతే నా తల్లిదండ్రులకు క్రికెట్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని అర్థమైంది. ఆ తర్వాతే వాళ్లే నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు' అని యువ క్రికెటర్‌ చేతన్‌ చెప్పాడు.

జహీర్‌ ఖాన్‌ ఆదర్శం:

జహీర్‌ ఖాన్‌ ఆదర్శం:

'మొదట్లో మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. మా మామయ్య చాలా సాయం చేశారు. ఆయన స్టేషనరీ షాప్‌ నడిపేవారు. అందులోనే నాకు చిన్న ఉద్యోగం ఇచ్చారు. తనకు సాయంగా ఉంటే.. స్కూలు ఫీజులు కట్టడంతో పాటు, క్రికెట్‌ ఆడటానికి వెళ్లేందుకు డబ్బులు ఇస్తానని చెప్పారు. చెప్పినట్టే చేశారు. నేను బౌలర్‌ కాబట్టి పెద్దగా క్రికెట్‌ కిట్ల అవసరం కూడా ఉండేది కాదు. ఒక లెఫ్టార్మ్‌ సీమర్‌ అయిన నాకు జహీర్‌ ఖాన్‌ ఆదర్శం. ముంబై ఇండియన్స్‌ క్యాంపులో ఉన్నపుడు ఆయన ఎన్నో సలహాలు ఇచ్చేవారు. నా బౌలింగ్‌ యాక్షన్‌ బాగుందని మెచ్చుకున్నారు' అని చేతన్‌ పేర్కొన్నాడు.

ఇల్లు కొనాలనుకుంటున్నా:

ఇల్లు కొనాలనుకుంటున్నా:

'ఐపీఎల్ డబ్బుతో నా కుటుంబం కోసం ఓ ఇల్లు కొనాలనుకుంటున్నా. ప్రస్తుతం మేం వర్టేజ్‌ గ్రామంలో ఉంటున్నాం. రాజ్‌కోట్‌లో ఓ ఇల్లు కొని కుటుంబాన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తాను. అంతా బాగున్నా.. నా తమ్ముడు చనిపోయిన బాధ మాత్రం వెంటాడుతుంది. నేను తనను చాలా మిస్పవుతున్నా. నేను ఇంట్లో లేనపుడు వాడే అన్ని పనులు చూసుకునేవాడు. కానీ ఇప్పుడు తను లేడు. తన మరణం నాకొక పెద్ద షాక్‌' అని చేతన్‌ సకారియా చెప్పుకొచ్చాడు.

India vs England: బుమ్రాను పక్కన పెడితే.. ఆ అనుభవం భువనేశ్వర్‌కు మాత్రమే ఉంది! జాగ్రత్తగా కాపాడుకోవాలి!

Story first published: Wednesday, March 10, 2021, 20:11 [IST]
Other articles published on Mar 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+