Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ జరగకుంటే నా పరిస్థితి దారుణంగా ఉండేది.. ఆ డబ్బుతోనే నాన్నకు కోవిడ్ చికిత్స చేయిస్తున్నా: చేతన్ సకారియా

Chetan Sakariya says Can give better treatment to my father because of the money I earned from IPL

న్యూఢిల్లీ: ఐపీఎల్ సంపాదన తన తండ్రికి మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుందని రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా అన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరఫున అరంగేట్రం చేసిన ఈ యువ పేసర్ అద్భుత ప్రదర్శనతో అందర్ని ఆకట్టుకున్నాడు. తనదైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. కోటి 20 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది.

అయితే కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థాంతరంగా వాయిదా పడగా.. తనకు రావాల్సిన డబ్బు వచ్చేసిందని ఈ యువ పేసర్ చెప్పుకొచ్చాడు. పైగా ఈ కఠిన సమయంలో ఆ డబ్బు తన కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. తన తండ్రి కరోనా బారిన పడ్డారని, ఆయనకు తన ఐపీఎల్ సంపాదనతో చికిత్స చేయిస్తున్నట్లు తెలిపాడు.

చాలా లక్కీ..

చాలా లక్కీ..

'నేను చాలా లక్కీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున నాకు రావాల్సిన డబ్బు కొద్ది రోజుల క్రితమే అందింది. నేను వెంటనే ఆ డబ్బును ఇంటికి పంపించాను. ఈ కఠిన సమయంలో అది నా కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడింది. 'అని పేర్కొన్నాడు. క్రికెట్ ఒక్కటే తనకు ఆదాయ మార్గామని ఈ యువ పేసర్ చెప్పుకొచ్చాడు. ఆ డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించడంతో పాటు తన తండ్రికి మెరుగైన చికిత్స అందించగలనని తెలిపాడు. ఐపీఎల్ 2021 సీజన్‌ తన జీవితాన్ని మార్చేసిందని, ఈ టోర్నీ జరగకపోయుంటే తన పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదన్నాడు.

నా పరిస్థితి దయనీయం..

నా పరిస్థితి దయనీయం..

'చాలా మంది ఐపీఎల్‌ను ఆపేయాలని డిమాండ్ చేశారు. వారందరికి నేనొక్కటే చెప్పాలనుకుంటున్నా. నా కుటుంబంలో డబ్బులు సంపాదించేది నేనొక్కడినే. నా సంపాదనకు ఏకైక మార్గం ఐపీఎల్. ఈ లీగ్ నుంచి సంపాదించిన డబ్బుతోనే నేను నా తండ్రికి మెరుగైన చికిత్స అందించాను. నెలరోజుల పాటు ఈ టోర్నీ గనుక జరగకపోయుంటే నా పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. నా తండ్రి తన జీవితం మొత్తం టెంపో డ్రైవర్‌గా పనిచేశాడు. కాబట్టి నా జీవితమే ఐపీఎల్. అదే నా రాతను మార్చేది'అని సకారియా భావోద్వేగానికి గురయ్యాడు.

7 మ్యాచ్‌లు 7 వికెట్లు..

7 మ్యాచ్‌లు 7 వికెట్లు..

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన చేతన్ సకారియా.. ఏడు వికెట్లు తీశాడు. రెండు సార్లు మూడేసి వికెట్లు పడగొట్టాడు. పంజాబ్‌తో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లోనే (3/31) కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, జై రిచర్డ్‌సన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఆ మ్యాచ్‌లో నికోలస్ పూరన్‌ను సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.

ఇది ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్స్ సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీల వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే సకారియా.. టీ20 క్రికెట్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముఖంలో చిరునవ్వే ఉండే సకారియాకు మంచి భవిష్యత్తు ఉందని కామెంటేర్లు కొనియాడారు.

Story first published: Friday, May 7, 2021, 11:27 [IST]
Other articles published on May 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+