Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: కాటేరమ్మ కొడుకులు కాదు.. శాతగాని కొడుకులు!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్‌లో ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్‌‌తో బుధవారం ఉప్పల్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. మరోసారి టాపార్డర్ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రదర్శనపై నెటిజన్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సన్‌రైజర్స్ బ్యాటర్లు 'కాటేరమ్మ కొడుకులు కాదని.. శాతగాని కొడుకులు'అంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును అభిమానించడం తాము చేసిన తప్పిదమని మ్యాచ్ అనంతరం ఉప్పల్ గ్రౌండ్ బయట మా మైఖేల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు రామని, మొత్తం ఫిక్సింగ్ అని, ఇతర జట్ల అభిమానులు ఎగతాళి చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు.

Chetakani Kodukulu SRH batters trolled by fans after another flop show in IPL 2025 match vs MI

సింగిల్ డిజిట్‌కే..
ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(8), ఇషాన్ కిషన్(1), నితీష్ కుమార్ రెడ్డి(2), అనికేత్ వర్మ(12)ల చెత్త బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే టాప్-4 వికెట్లు కోల్పోయింది. పరిస్థితులతో సంబంధం లేకుండా చెత్త షాట్లు ఆడి హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. హెన్రీచ్ క్లాసెన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), ఇంపాక్ట్ ప్లేయర్ అభినవ్ మనోహర్(37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) దయతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేయగలిగింది.

ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(4/26) నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించగా.. దీపక్ చాహర్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 146 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో తన ఫామ్ కొనసాగించగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనాద్కత్, మలింగా, జీషన్ అన్సారీ చెరో వికెట్ తీసారు.

చేతకాని కొడుకులు..
గత సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డ్ స్కోర్లు నమోదు చేయడంతో పాటు జట్టు ఫైనల్ కూడా చేరడంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలకు ఫ్యాన్స్ కాటేరమ్మ కొడుకులని ముద్దుగా పేరు పెట్టారు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఈ నలుగురికి తోడుగా ఇషాన్ కిషన్ చెలరేగడంతో అతన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు. కానీ ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో ఈ ఐదుగురు తేలిపోవడం.. ముంబైతో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమం కావడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు కాటేరమ్మ కొడుకులు కాదని, చేతకాని కొడుకులు అంటూ మండిపడుతున్నారు.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా.. హెన్రీచ్ క్లాసెన్(1 హాఫ్ సెంచరీతో 281)టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్(2 హాఫ్ సెంచరీలతో 242), అభిషేక్ శర్మ( సెంచరీతో 240), ఇషాన్ కిషన్(ఒక సెంచరీతో 139), నితీష్ కుమార్ రెడ్డి(132 రన్స్) పరుగులే చేశారు. బలమే అనుకున్న బ్యాటింగ్.. బలహీనంగా మారడంతో సన్‌రైజర్స్‌‌‌కు వరుస ఓటములు తప్పడం లేదు.

Story first published: Thursday, April 24, 2025, 10:22 [IST]
Other articles published on Apr 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+