IPL 2020: ఐపీఎల్ ఓపెనింగ్ గేమ్ చెన్నై ఆడట్లేదు.. ఎందుకంటే?!!

దుబాయ్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ సెప్టెంబర్ 19నుండి ప్రారంభం కానుంది. గతంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 19న డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఓపెనింగ్ గేమ్ జరగాల్సి ఉంది. అయితే టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై తలపడే అవకాశం ఇప్పుడు లేదు. తొలి మ్యాచ్ ఆడేందుకు సీఎస్‌కే ఇంకా సన్నద్ధం కాలేదు.

12 కరోనా కేసులు :
అందరి కంటే ముందే ఆగష్టు 21న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దుబాయ్‌కు వెళ్లింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఆ రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంది. ఐపీఎల్‌లోని మిగిలిన ఏడు జట్లు కూడా యూఏఈకి చేరుకుని ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నాయి. కానీ ఏ జట్టులోనూ కనీసం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ చెన్నై టీమ్‌లో ఏకంగా 12 కరోనా కేసులు బయటపడ్డాయి. శుక్రవారం ఈ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 10 మంది సిబ్బంది వైరస్ బారినపడ్డారు.

రెండు వారాల క్వారంటైన్:
వైరస్ సోకని చెన్నై ఆటగాళ్లు కూడా మరో 6 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఇక కరోనా ఉన్నవారు రెండు వారాల పాటు క్వారంటైన్ నిబంధనలను పాటించాలి. దీంతో ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు. దీనికితోడు సీపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు 17-18 తేదీలలో దుబాయ్ వచ్చి.. 6 రోజుల క్వారంటైన్ పూర్తి చేయాలి. దీంతో వారు లీగ్ మొదటివారం మ్యాచులకు దూరమవుతారు. మరోవైపు చెన్నై స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్నారు. రైనా నిష్క్రమణ, ఆటగాళ్లకు కరోనా సోకడం, విదేశీ ఆటగాళ్ల క్వారంటైన్ సమయంతో చెన్నై ప్రాంచైజీ తలపట్టుకుంది.

షెడ్యూల్‌లో స్పల్ప మార్పులు:
ప్రస్తుతం చెన్నైకి ఉన్న కష్టాల ప్రభావం ఐపీఎల్ 2020 లీగ్ ఆరంభ మ్యాచ్‌పై పడే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ భావిస్తోంది. 'చెన్నై ఇప్పుడు ఐపీఎల్ 2020 ఓపెనింగ్ మ్యాచ్ ఆడే స్థితిలో లేదు. ఎదురుదెబ్బ నుంచి బయటపడటానికి చెన్నైకి మరికొన్ని రోజులు సమయం ఇస్తాం' అని ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. చెన్నైకి మొదటి వారంలో మ్యాచులు లేకుండా షెడ్యూల్‌లో స్పల్ప మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం ప్రస్తుతం బీసీసీఐ కసరత్తులు చేస్తోందట. అందుకే ఈరోజు విడుదల కావాల్సిన షెడ్యూల్ మరింత ఆలస్యం కానుంది.

ఐపీఎల్ 2020 సాధ్యమవుతుందా?:
మరోవైపు అనుకున్న దానికంటే ఆటగాళ్లపై ఆరంభంలోనే కరోనా వైరస్ ప్రభావం చూపడంతో అసలు ఐపీఎల్ 2020 సాధ్యమవుతుందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్ల క్వారెంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ ఆరంభించినా.. వైరస్ ఎటు నుంచి దాడి చేస్తోందనే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2020: ఐపీఎల్ అఫీషియల్ పార్ట్‌నర్‌గా అన్అకాడమీ!!