Chennai Super Kings Squad For IPL 2022: చెన్నై లోకి ధావన్, అశ్విన్.. పూర్తి జట్టు ఇదే!

హైదరాబాద్:ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని, ఎంత ఖర్చు పెట్టాలనే పక్కా లెక్కలను తయారు చేసుకుంటున్నాయి. ఇక అన్ని విషయాల్లో ఓ అడుగు ముందుండే చెన్నై సూపర్ కింగ్స్ వేలానికి కూడా అలానే సమయాత్తం అవుతోంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై చేరుకోని ప్రణాళికలను రచించడంలో నిమగ్నమయ్యాడు. ఫిబ్రవరి 12,13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనున్న మెగా ఆక్షన్‌కు ధోనీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అతనికి చివరి సీజన్ కానున్న నేపథ్యంలో టీమ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్లను ఎంచుకోవాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ధోనీతో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను రిటైన్ చేసుకున్న ఆ జట్టు.. మిగతా స్పాట్స్ కోసం సరైన ఆటగాళ్లను ఎంచుకోవాలనుకుంటుంది. టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌తో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈసారి చెన్నై జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై ఎంచుకునే ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా రుతురాజ్, ధావన్..
గత సీజన్‌లో ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే రుతురాజ్ గైక్వాడ్‌ను రిటైన్ చేసుకోగా.. ఫాఫ్ వేలంలోకి వెళ్లాడు. డుప్లెసిస్‌ను తీసుకునేందుకు సీఎస్‌కే మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉంది. అంతే కాకుండా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కూడా తీసుకునే చాన్స్ ఉంది. 35 ప్లస్ వయసు గల ఆటగాళ్లను తీసుకునేందుకు చెన్నై ఎప్పుడూ ఆసక్తికనబరుస్తూ ఉంటుంది. ఫాఫ్, ధావన్‌లలో ఎవరు చిక్కితే వారిని తీసుకోనుంది. అవసరమైతే ధావన్ కోసం రూ. 9 కోట్లు ఖర్చుపెట్టేందుకు కూడా చెన్నై రెడీగా ఉంది.

రైనా, ఊతప్పకు చాన్స్..
వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా, రాబిన్ ఊతప్పలను కూడా చెన్నై తీసుకునే చాన్సుంది. మొయిన్ అలీతో పాటు రైనా, రాబిన్ ఊతప్ప మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా, బ్యాకప్ ప్లేయర్స్‌గా సేవలు అందించే చాన్సుంది. రిటైన్ చేసుకున్న రవీంద్ర జడేజాతో పాటు ధోనీ సైతం మిడిలార్డర్‌లోనే ఆడనున్నాడు. వీదేశి ఆటగాళ్లలో గ్లేన్ ఫిలిప్స్, సామ్ బిల్లింగ్స్ వంటి ప్లేయర్లను కూడా చెన్నై తీసుకునే చాన్సుంది. భారత దేశవాళీ బ్యాట్స్‌మన్‌ల్లో జలజ్ సక్సెనా, ధృవ్ షోరే వంటి ఆటగాళ్లను ఎంచుకోవచ్చు.

అశ్విన్ రీఎంట్రీ..
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చే చాన్సుంది. ఈ వెటరన్ స్పిన్నర్‌ను తీసుకునేందుకు సీఎస్‌కే ఫ్రాంచైజీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్వల్ప ధరకు దొరికితేనే తీసుకోవాలని, భారీ ధర అయితే రిస్క్ చేయవద్దనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. యువ బౌలర్ కార్తీక్ త్యాగీతో పాటు విదేశీ బౌలర్లు జోష్ హజెల్ వుడ్, మార్క్ వుడ్, లుంగి ఎంగిడిలను కూడా తీసుకునే చాన్సుంది. న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ సాంట్నర్‌ను కూడా చెన్నై టార్గెట్ చేయనుంది.

చాహర్, శార్దూల్‌ను సైతం..
గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కే ఆడిన దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లను మళ్లీ తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించడం ఖాయం. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్న ఈ స్టార్ పేసర్లకు మంచి డిమాండ్ ఉంది. ఇతర ఫ్రాంచైజీలు సైతం వీరి కోసం ఎగబడనున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు చెన్నైకి చిక్కడం కష్టం. కాకపోతే ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకోవడం మాత్రం ఖాయం. శార్దూల్ ఠాకూర్ కంటే దీపక్ చాహరే చెన్నైకి దక్కే అవకాశాలున్నాయి. తెలుగు క్రికెటర్ హరిశంకర్ రెడ్డిని కూడా చెన్నై సూపర్ కింగ్సే మరోసారి కరుణించవచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్(అంచనా)
మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా, గ్లేన్ ఫిలిప్స్, సామ్ బిల్లింగ్స్, ఫాఫ్ డుప్లెసిస్/శిఖర్ ధావన్, కార్తీక్ త్యాగీ, జోష్ హజెల్ వుడ్, మార్క్ వుడ్, లుంగి ఎంగిడి, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్/శార్దూల్ ఠాకూర్, హరిశంకర్ రెడ్డి, థృవ్ షోరే, జలజ్ సక్సెనా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications