కరోనా నుంచి కోలుకుంటున్నా
కరోనా పాజిటివ్‌గా తేలిన దీపక్ చహర్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. పూర్తిగా హోటల్ రూమ్‌కు పరిమితమైన దీపక్‌కు సంబంధించిన ఓ వీడియోను సీఎస్‌కే మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో చహర్ మాట్లాడుతూ... 'నేను కోలుకున్నాను. ఫిట్‌గా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నా. త్వరలోనే నన్ను మళ్లీ మైదానంలో చూస్తారు. నాకోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు' అని తెలిపాడు. వీడియోలో అతడు ప్రత్యేకంగా కాళ్లకు సంబంధించిన వర్కవుట్‌లు చేస్తున్నాడు.

వెన్ను గాయంతో దూరం:
గత ఏడాది డిసెంబర్‌లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్‌లో దీపక్ చహర్ గాయడ్డాడు. దీంతో అప్పటినుండి జట్టుకు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం తీసుకున్నాడు. అక్కడ ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. కరోనా కారణంగా ఐదు నెలలు బ్రేక్ రావడంతో ఇప్పుడు అతను వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచ్‌లాడిన చహర్.. 22 వికెట్లు పడగొట్టాడు. ఇదే అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. భారత్ తరఫున 10 అంతర్జాతీయ టీ20లు ఆడిన చహర్.. 7 ఎకనామితో 17 వికెట్లు పడగొట్టాడు. ఇక మూడు వన్డేలలో రెండు వికెట్లు తీశాడు.

13 మందికి తప్ప:
కరోనా బారిన పడిన 13 మందికి తప్ప.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని మిగతా వారందరికీ తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని చెన్నై సీఈఓ కా శీ విశ్వనాథన్ తెలిపారు. 'ఆ పదమూడు మందికి తప్ప మిగతా వారందరికీ కరోనా నెగెటివ్‌గా వచ్చింది. వీరికి గురువారం మరోసారి పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 4 నుంచి చెన్నై జట్టు ప్రాక్టీస్ ప్రారంభించే అవకాశాలున్నాయి' అని విశ్వనాథన్ చెప్పారు.

గందరగోళంలో చెన్నై పరిస్థితి:
ఇదిలా ఉంటే.. చెన్నై పరిస్థితి ప్రస్తుతం కొంత గందరగోళంలో పడింది. ప్రధాన ఆటగాడు సురేష్ రైనా ఉన్నట్లుంది టోర్నీ నుంచి నిష్క్రమించడం, వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా ఐపీఎల్‌లో పాల్గొనబోడని వార్తలొస్తుండడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. దానికి తోడు ప్రధాన పేసర్ దీపక్ చహర్, మరో ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌లు కరోనా బారిన పడడం జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. సీఎస్‌కే ఇంకా సాధన కూడా మొదలెట్టలేదు. ఇలా చెన్నై అన్ని రకాలుగా ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. మరి వీటన్నింటి నుంచి కోలుకుని ఆ జట్టు ఒత్తిడిని ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.
ధోనీకి పెద్ద అభిమానిని.. డ్రస్సింగ్ రూమ్ వద్దకు పరుగెత్తుకెళ్లి మహీని కలిశా: టీమిండియా దిగ్గజం


Click it and Unblock the Notifications












