Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి పెద్ద అభిమానిని.. డ్రస్సింగ్‌ రూమ్‌ వద్దకు పరుగెత్తుకెళ్లి మహీని కలిశా: టీమిండియా దిగ్గజం

Javagal Srinath recalled 17 year old incident when he ran up to MS Dhoni to tell he is his fan

హైదరాబాద్: తాను క్రికెట్‌కు వీడ్కోలు పలికాక 2003లో కెన్యాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తొలిసారి కలిశాను అని భారత మాజీ పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్ తెలిపారు‌. ఆ సిరీస్‌లో మహీ ఒంటి చేత్తో భారత్‌ ఏ జట్టును గెలిపించాడని, మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాక డ్రస్సింగ్‌ రూమ్‌ వద్దకు పరుగెత్తుకెళ్లి మాట్లాడినట్లు చెప్పారు. ధోనీ క్రికెట్‌లో ఒక యోగి అని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ పేస్ బౌలింగ్‌కు సరికొత్త రూపాన్ని ఇచ్చిన వ్యక్తి శ్రీనాథ్. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్‌లతో టీమిండియా పేస్ ఇప్పుడు స్ట్రాంగ్ అయినప్పటికీ.. భారత క్రికెట్ మిడిల్ ఏజీలో మాత్రం శ్రీనాథ్ ఒక్కడే పేస్ విభాగాన్ని తన భుజాలపై మోశారు.

 పేస్ భారం మోయాల్సి వచ్చింది:

పేస్ భారం మోయాల్సి వచ్చింది:

ఇటీవల భారత వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో 'డీఆర్‌ఎస్‌ విత్‌ ఆశ్‌' అనే కార్యక్రమంలో జవగళ్‌ శ్రీనాథ్ మాట్లాడి‌ అనేక విషయాలు అభిమానులతో పంచుకున్నారు. మొదటగా కరోనాపై స్పందింస్తూ... 'లాక్‌డౌన్‌ బాగా విజయవంతం అయ్యింది. మా రాష్ట్రంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించారు. పోలీసులు బలవంతంగా నిర్బంధించాల్సిన అవసరం రాలేదు' అని శ్రీనాథ్ తెలిపారు. తాను ఆడే రోజుల్లో భారత పేస్‌ బౌలింగ్‌పై మాట్లాడుతూ... 'నేనే పేస్ భారం మోయాల్సి వచ్చింది. అప్పట్లో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో నెట్టుకురావడం కష్టమైంది. విదేశాల్లో రాణించాలంటే నలుగురు పేసర్లు కచ్చితంగా ఉండాలి. నేను ఆడే రోజుల్లో అలాంటి అవకాశం లేకపోయింది' అని చెప్పారు.

మహీ ఓ యోగి:

మహీ ఓ యోగి:

మ్యాచ్‌ రిఫరీగా ఎంఎస్ ధోనీతో ఉన్న అనుభవంను పేస్‌ దిగ్గజం గుర్తుచేసుకున్నారు. ధోనీపై ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదులు లేవని, క్రికెట్‌లో మహీ ఓ యోగి అని పేర్కొన్నారు. 'ధోనీ ఆటను అర్థం చేసుకున్న తీరు. ఫలితాల పట్ల అతడి నిబద్దత, ప్రతీ విజయంలో మాట్లాడే పద్ధతి, గెలిచిన కప్పులను ఇతరులకు ఇచ్చి పక్కకు తప్పుకునే తత్వం, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఏమీ జరగనట్లు ప్రశాంతంగా ఉండే స్వభావం లాంటివన్నీ అతడికే చెల్లాయి. అంత విజయవంతమైన సారథి అయ్యాడంటే కచ్చితంగా యోగే' అని శ్రీనాథ్‌ అభిప్రాయపడ్డారు.

డ్రస్సింగ్‌ రూమ్‌ వద్దకు పరుగెత్తుకెళ్లా:

డ్రస్సింగ్‌ రూమ్‌ వద్దకు పరుగెత్తుకెళ్లా:

ఎంఎస్ ధోనీని తొలిసారి ఎప్పుడు కలిశారని అశ్విన్‌ అడగ్గా... 2003లో కెన్యాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో కలిశానన్నారు. 'ఆ సిరీస్‌లో అతడు బౌలర్లందరిని ఊచకోత కోశాడు. దాంతో నేను థ్రిల్లింగ్‌గా ఫీలై డ్రస్సింగ్‌ రూమ్‌ వద్దకు పరుగెత్తుకెళ్లాను. ధోనీని బయటకు పిలిచి.. నేను నీకు పెద్ద అభిమానిని అని చెప్పాను. త్వరలోనే టీమిండియాకు ఆడాలని కోరాను. అనుకున్నట్లే ధోనీ ఎక్కడికి దాకా వెళ్లాడో మనం చూశాం. కాబట్టి కచ్చితంగా అతడు యోగి అని నేను భావిస్తాను' అని మాజీ పేసర్ శ్రీనాథ్‌ ‌అన్నారు.

 రజనీతో జోక్ చేశా:

రజనీతో జోక్ చేశా:

ఇష్టమైన నటులెవరని ప్రశ్నించగా... అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్ ‌ఖాన్‌, రజనీ కాంత్‌ పేర్లను శ్రీనాథ్‌ చెప్పారు. రజనీ అంటే ఎందుకిష్టమని అశ్విన్‌ అడగ్గా... 'సూపర్‌ స్టార్‌ సినిమాలు చూస్తే ఎనర్జీ వస్తుంది. ఎవరైనా నిరాశలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు చూడండి. అతడి నటన, స్టైల్‌ బాగుంటాయి. నేను రజనీని పలుమార్లు కలిశా. ఒకసారి బెంగుళూరు విమానాశ్రయంలో రజనీ కనిపిస్తే.. అతని కారులోనే లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి జోక్ చేశా' భారత దిగ్గజం చెప్పుకొచ్చారు.

క్రికెట్ ఆడడానికి మాత్రమే ఇక్కడకు వచ్చాం.. ఎంజాయ్ చేయడానికి కాదు: కోహ్లీ వార్నింగ్‌‌

Story first published: Tuesday, September 1, 2020, 17:50 [IST]
Other articles published on Sep 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+