Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: పటిష్టంగా చెన్నై సూపర్ కింగ్స్.. పూర్తి జట్టు ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ చాకచక్యంగా వ్యవహరించింది. గతానికి భిన్నంగా అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. జట్ట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గత సీజన్ చివర్లోనే జట్టు బలోపేతంపై ఫోకస్ పెట్టిన సీఎస్‌కే అందుకు తగ్గట్లుగానే అవసరం లేని ఆటగాళ్లను వదిలేసింది. వేలానికి ముందే సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న సీఎస్‌కే అతని కోసం రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసింది.

అనామక ఆటగాళ్లపై కనక వర్షం

ప్రధాన ఆటగాళ్లకు తగ్గట్లుగా వేలంలో కావాల్సిన ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఎన్నడూ లేని విధంగా అనామక ఆటగాళ్లు అయిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ‌లపై సీఎస్‌కే కోట్లు కుమ్మరించింది. ఈ ఇద్దర్నీ సీఎస్‌కే రూ.14.20 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ స్థానాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ ఇద్దరిని తీసుకుంది.

Chennai Super Kings IPL 2026 Final Squad Full List of Players Bought in the Mini Auction

అకీల్ హోస్సేన్‌ను రూ.2 కోట్లకు తీసుకున్న సీఎస్‌కే, మాథ్యూ షార్ట్ (రూ.1.5 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్(రూ.75 లక్షలు) వంటి ప్లేయర్లను తీసుకుంది. స్పిన్నర్ రాహుల్ చాహర్‌ కోసం రూ.5.2 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సమతూకంగా కనిపిస్తోంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో పవర్‌ఫుల్‌గా ఉంది.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు

అకీల్ హోస్సేన్(రూ.2 కోట్లు), ప్రశాంత్ వీర్(రూ.14.20 కోట్లు), కార్తీక్ శర్మ(రూ.14.20 కోట్లు), మాథ్యూ షార్ట్(రూ.1.5 కోట్లు), అమన్ ఖాన్(రూ.40 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్(రూ.75 లక్షలు), మ్యాట్ హెన్రీ(రూ.2 కోట్లు), రాహుల్ చాహర్(రూ.5.2 కోట్లు), జాక్ ఫోల్క్స్(రూ.75 లక్షలు)

రిటైన్ లిస్ట్:

రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, మహేంద్ర సింగ్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజూ శాంసన్(ట్రేడ్ ఇన్), శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి.

తుది జట్టు(అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, మహేంద్ర సింగ్ ధోనీ, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ముఖేష్ చౌదరి/జెమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్.

Story first published: Tuesday, December 16, 2025, 21:32 [IST]
Other articles published on Dec 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+