For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK Playing XI vs KKR: ఓపెనర్‌గా డెవాన్ కాన్వే.. నెంబర్ 7లో ధోనీ! కేకేఆర్‌తో బరిలోకి దిగే చెన్నై జట్టు ఇదే!

Chennai Super Kings(CSK) Playing XI For The First Match Against Kolkata Knight Riders (KKR)

ముంబై: అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య వాంఖడే వేదికగా బిగ్ ఫైట్ జరగనుంది. సరిగ్గా ఈ మ్యాచ్‌కు రెండు రోజుల ముందే అనూహ్యంగా చెన్నై సారథ్య బాధ్యతల నుంచి ధోనీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. టీమ్‌లో తనకెంతో నమ్మకస్తుడైన రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. దాంతో ధోనీ ఓ సీనియర్ ఆటగాడిగానే ఈ సీజన్‌లో కనిపించనున్నాడు. ఇన్నాళ్లు ధోనీ సేనగా ముద్రపడ్డ సీఎస్‌కే ఇప్పుడు జడేజా సేనగా మారింది. ఈ క్రమంలోనే కేకేఆర్‌తో జరగబోయే ఫస్ట్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కోట్లు పెట్టి కొన్న దీపక్ చాహర్ గాయంతో దూరమవడం, గత సీజన్‌లో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఫాఫ్ డుప్లెసిస్ లేకపోవడం, వీసా కారణాల వల్ల మొయిన్ అలీ ఫస్ట్ మ్యాచ్‌కు దూరమవడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి టీమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందా? అనే చర్చ ఊపందుకుంది. కోల్‌కతాతో చెన్నై బరిలోకి దిగే జట్టు కాంబినేషన్‌పై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా రుతురాజ్, డెవాన్ కాన్వే..

ఓపెనర్లుగా రుతురాజ్, డెవాన్ కాన్వే..

ఓపెనర్లుగా గత సీజన్‌లో దంచి కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. అతనికి తోడు న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే బరిలోకి దిగే అవకాశం ఉంది. మొయిన్ అలీ ఫస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో లేడు కాబట్టి కాన్వే‌కు లైన్ క్లియర్ అయింది. పైగా అతను లెఫ్టాండర్ కావడం కలిసొచ్చే అంశం. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చూసుకున్నా.. కాన్వే ప్లేస్‌కు డోకా లేదు. ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ ఆకాశ్ చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. డెవాన్ కాన్వే, రుతురాజ్‌లే ఓపెనింగ్ చేసే అవకాశం ఉందన్నాడు.

నంబర్ 7లో ధోనీ...

నంబర్ 7లో ధోనీ...

మొయిన్ అలీ ఫస్ట్ మ్యాచ్‌కు దూరమైన నేపథ్యంలో రాబిన్ ఊతప్పకు లైన్ క్లియర్ అయింది. అతను ఫస్ట్ డౌన్‌లో ఆడే అవకాశం ఉండగా.. ఆ తర్వాత అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే బరిలోకి దిగనుండగా.. ఏడో స్థానంలో ధోనీ వచ్చే అవకాశం ఉంది. శివమ్ దూబేకు ఈ సీజన్ లిట్మస్ టెస్ట్ లాంటిది. రాణిస్తే భవిష్యత్తు ఉంటుంది లేకుంటే.. సాధారణ ఆటగాడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. ధోనీ సారథ్యంలో ఆడుతున్న శివమ్ దూబేకు ఈ సీజన్ బ్రేక్ త్రూ కావొచ్చిన ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. రెండు రాయల్స్ టీమ్‌తో అతనికి కలిసి రాలేదని, సీఎస్‌కే జట్టులో స్థానం పదిలం చేసుకుంటే అతని కథ వేరేలా ఉంటుందన్నాడు.

హంగార్గేకర్‌కు చాన్స్..

హంగార్గేకర్‌కు చాన్స్..

8వ స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో బరిలోకి దిగనుండగా.. ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్‌లకు అవకాశం దక్కనుంది. దీపక్ చాహర్ స్థానంలో అండర్ 19 స్టార్ హంగార్గేకర్ అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చాహర్ అందుబాటులోకి వస్తే పరిస్థితులకు తగ్గట్లు జోర్డాన్, బ్రావో‌లకు అవకాశాలు ఇవ్వనున్నారు. ఫస్ట్ మ్యాచ్‌కు మొయిన్ అలీ దూరమవడంతో స్పిన్నర్‌గా జడేజా ఒక్కడే అందుబాటులో ఉండనున్నాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణకు అవకాశం దక్కవచ్చు.

 సీఎస్‌కే తుది జట్టు (అంచనా)

సీఎస్‌కే తుది జట్టు (అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ(కీపర్), డ్వేన్ బ్రావో, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, హంగార్గేకర్

Story first published: Friday, March 25, 2022, 17:12 [IST]
Other articles published on Mar 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+