Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే ఆడడానికి కారణం ఎంఎస్ ధోనీనే!!

Chennai Super Kings captain MS Dhoni takes bravest decision in IPL 2020

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఏ కెప్టెన్ తీసుకోని అత్యంత కఠిన నిర్ణయంను చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్‌కే)‌ సారథి ఎంఎస్ ధోనీ తీసుకున్నాడు. కీలక ఆటగాళ్లు లీగ్ నుండి వైదొలగడం, ఇద్దరు కీలక ప్లేయర్లు కరోనా బారిన పడడం, సరైన ప్రాక్టీస్ లేకున్నా.. మహీ ముందడుగేశాడు. సెప్టెంబర్‌ 19న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే తలపడుతుందని ఐపీఎల్ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌కు స్పష్టం చేశాడట.

ఒప్పుకోని ధోనీ

ఒప్పుకోని ధోనీ

'మరో 14 రోజుల్లో' అని విరాట్ కోహ్లీ, దినేశ్‌ కార్తీక్‌ చిత్రాన్ని ఐపీఎల్‌ తన ట్విటర్లో ఇటీవల పోస్ట్ చేసింది. దీంతో ఐపీఎల్ 2020 ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తలపడతాయని అందరూ అనుకున్నారు. అయితే ఎంఎస్‌ ధోనీ తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్లే మొదటి మ్యాచ్‌లో చెన్నై ఆడుతోందట. సెప్టెంబర్‌ 23న తొలి మ్యాచ్‌ ఆడేందుకు సీఎస్‌కేకు ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ సీఎస్‌కే అవకాశం కల్పించారని తెలిసింది. సెప్టెంబర్‌ 23న తొలి మ్యాచ్ అయితే.. సీఎస్‌కేకు ఐదు రోజులు సాధన చేసేందుకు సమయం దొరుకుతుందని అలా చేశారు. ధోనీ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదని సమాచారం.

మొదటి ఆరు రోజుల్లోనే మూడు మ్యాచులు:

మొదటి ఆరు రోజుల్లోనే మూడు మ్యాచులు:

కెరీర్‌లో ఎన్నోసార్లు సాహసాలు చేసిన ఎంఎస్ ధోనీ మరోసారి కఠిన నిర్ణయానికే మొగ్గుచూపాడు. సాధనకు సమయం లేకున్నా.. సెప్టెంబర్‌ 19నే లీగ్ తొలి మ్యాచులో తలపడతామని బ్రిజేష్‌ పటేల్‌కు స్పష్టం చేశాడట. దీంతో మొదటి ఆరు రోజుల్లోనే సీఎస్‌కే మూడు మ్యాచులు ఆడాల్సి వస్తుంది. విశ్రాంతి తీసుకొనే సమయమూ దొరకదు. సీఎస్‌కే ఆటగాళ్లు కూడా లీగ్ తొలి మ్యాచ్ ఆడేందుకు విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ఐపీఎల్‌ వర్గాలు అనుకుంటున్నాయి.

 ముంబై X చెన్నై:

ముంబై X చెన్నై:

ఐపీఎల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రన్నరప్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య అబుదాబి వేదికగా ఈ నెల 19న తొలి మ్యాచ్‌తో లీగ్‌కు తెరలేవనుంది. అబుదాబి వేదికగా సెప్టెంబర్‌ 19న ముంబై ఇండియన్స్, షార్జా వేదికగా 22న రాజస్థాన్‌ రాయల్స్‌, దుబాయ్‌ వేదికగా 25న దిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది.

46 రోజుల పాటు 56 మ్యాచ్‌లు

46 రోజుల పాటు 56 మ్యాచ్‌లు

ఐపీఎల్ 2020 మూడు వేదికలు (అబుదాబి, షార్జా, దుబాయ్‌)గా 46 రోజుల పాటు 56 మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇన్ని రోజులు లీగ్‌ జరుగడం ఇదే తొలిసారి. మొత్తం మ్యాచ్‌ల్లో దుబాయ్‌లో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 జరుగనున్నాయి. అయితే ఫ్లే ఆఫ్‌ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

'3-4 బౌలర్లను పరిశీలిస్తున్నా.. ఆయన లోటును భర్తీ చేయడం సీఎస్‌కేకు అంత తేలిక కాదు'

Story first published: Monday, September 7, 2020, 16:49 [IST]
Other articles published on Sep 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+