Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs CSK: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌.. ఎంఎస్ ధోనీని ఊరిస్తోన్న మూడు రికార్డులు ఇవే!!

Chennai Super Kings captain MS Dhoni on cusp of breaking three new IPL records

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) మరో గెలుపుపై కన్నేసింది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్)‌తో చెన్నై మంగళవారం తలపడనుంది. స్టార్ ఆటగాళ్లు, ఎంఎస్ ధోనీ సారథ్యం చెన్నై జట్టుకు అతిపెద్ద బలం. మరోవైపు తన తొలి మ్యాచ్‌కు ముందు రాజస్థాన్‌ గందరగోళ స్థితిలో ఉంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్‌, జోస్ బట్లర్‌ లేకుండానే బరిలోకి దిగుతోంది. దీంతో ఎప్పటిలాగే ఈ మ్యాచ్‌లోనూ సీఎస్‌కేనే ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు.

ఐదు సిక్స్‌లు కొడితే

ఐదు సిక్స్‌లు కొడితే

ఈరోజు రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉన్న నేపథ్యంలో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఓ మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ ఇప్పటి వరకూ 295 సిక్స్‌లు బాదాడు. మరో ఐదు సిక్స్‌లు కొడితే.. మహీ 300 సిక్సర్ల మార్కును అందుకుంటాడు. ఇప్పటి వరకూ భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (361 సిక్సులు), సురేశ్ రైనా (311 సిక్సులు) మాత్రమే 300కుపైగా సిక్సులు బాదారు. ప్రస్తుతం 295 సిక్స్‌లతో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ మహీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకువస్తే.. ఈ మ్యాచులోనే 300 సిక్సుల మార్కును అందుకునే అవకాశం ఉంది.

రైనా రికార్డుపై కన్ను

రైనా రికార్డుపై కన్ను

వికెట్ కీపర్‌గా, ఫీల్డర్‌గా ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో 100 వంద క్యాచ్‌లు అందుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచులో మరో 3 క్యాచ్‌లు అందుకుంటే.. సురేశ్ రైనా (102)ను మహీ అధిగమిస్తాడు. రైనా ఐపీఎల్ 2020 ఆడట్లేదు కాబట్టి అతన్ని ధోనీ అధిగమిస్తాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ దినేశ్ కార్తీక్ మాత్రమే ధోనీ కంటే ముందుంటాడు.

మరో ఆరు క్యాచ్‌లు అందుకుంటే

మరో ఆరు క్యాచ్‌లు అందుకుంటే

వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు 96 క్యాచ్‌లు పట్టాడు. మరో నాలుగు క్యాచ్‌లు అందుకుంటే సెంచరీ మార్క్ చేరుకుంటాడు. ఇక ఐదు క్యాచ్‌లు పడితే.. ఐపీఎల్‌లో ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ (101) సరసన నిలుస్తాడు. ఆరు క్యాచ్‌లు అందుకుంటే.. డీకే రికార్డును అధిగమిస్తాడు. అయితే డీకే కూడా ఆడుతుండడంతో మహీ అతన్ని అధిగమించడం కొంచెం కష్టమే.

23 హాఫ్ సెంచరీలు

23 హాఫ్ సెంచరీలు

గత ఆగస్టు నెలలో ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఏడాదికి పైగా అతడు మైదానంలోకి దిగలేదు. దీంతో ముంబైతో జరిగిన మ్యాచులో మహీ ఆడడం కోసం అభిమానులు అందరూ ఎదురుచూసారు. అయితే ధోనీ క్రీజులోకి వచ్చినా.. పరుగులు చేసే అవకాశం రాలేదు. దీంతో రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌ చేయాలని అందరూ కోరుకుంటున్నారు.191 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 137.77 స్ట్రయిక్ రేట్‌తో 4432 పరుగులు చేశాడు. మహీ అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఐపీఎల్ టోర్నీలో మహీ 23 హాఫ్ సెంచరీలు బాదాడు.

RCB vs SRH: విజయ్ శంకర్‌ను ఔట్‌ చేసేందుకు మట్టి రాసుకున్న చహల్.. ‌ ఎందుకో తెలుసా?

Story first published: Tuesday, September 22, 2020, 16:23 [IST]
Other articles published on Sep 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+