For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాత్‌రూమ్ సింగర్‌‌గా ధోని.. సహచర ఆటగాళ్లతో ఫుల్ ఎంజాయ్!!

Chennai Super Kings Captain MS Dhoni enjoys ‘bathroom’ singing session with Piyush Chawla and Parthiv Patel

హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గత కొంతకాలంగా మైదానానికి దూరమైనా.. ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్ సెమీస్ ఓటమి అనంతరం పూర్తిగా ఆటకు దూరమైన మహీ.. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం జనవరి వరకు క్రికెట్ సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని మీడియాకు సూచించాడు.

ఆ తర్వాత కూడా ధోని నోరు విప్పకపోవడం.. బీసీసీఐ అతని పేరు కాంట్రాక్టుల నుంచి తొలగించడంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ధోని మాత్రం ఇవేమి పట్టించుకోకుండా త‌న‌కు ల‌భించిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు.

బాత్‌రూమ్ సింగర్‌గా..

మొన్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా అవతారమెత్తిన ధోని.. తాజాగా బాత్‌రూం సింగర్‌గా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. తన సహచర ఆటగాళ్లు పార్థీవ్ పటేల్, పియూష్ చావ్లాతో బాత్‌రూంలో సింగింగ్ సెషన్‌ను తెగ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఈ ముగ్గురు ఆటగాళ్లు కిషోర్‌ కుమార్ ఐకానిక్ బాలీవుడ్ సాంగ్ ‘మేరే మెహబూబా కయమత్ హోగీ'ఇతర వ్యక్తులతో పాడుతూ కనిపించారు. ధోని వాష్‌బెసిన్ పక్కన కూర్చోగా చావ్లా, పార్దీవ్ కింద కూర్చొని పాటకు ట్యూన్ ఇస్తూ ఎంజాయ్ చేశారు.

ప్రాక్టీస్‌కు రెడీ..

ప్రాక్టీస్‌కు రెడీ..

ఇక ఈ ఐపీఎల్ సీజన్‌కు ధోని సమాయత్తం అవుతున్నాడు. మార్చి 29 నుంచి ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుండటంతో చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోని తన ప్రాక్టీస్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. మార్చి ఒకటవ తేదీ నుంచి చెపాక్‌ స్టేడియంలో ధోని ప్రాక్టీస్‌ను ఆరంభించనున్నాడు. గత నెలలో జార్ఖండ్‌ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేసిన ధోని.. ఐపీఎల్‌ కోసం తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేయాలని చూస్తున్నాడు.

ధోనినే బెస్ట్ కెప్టెన్..

ధోనినే బెస్ట్ కెప్టెన్..

ఎప్పటికీ భారత అత్యుత్తమ కెప్టెన్ ధోనినేనని వెటరన్ బ్యాట్స్‌మన్, అతని సహచర ఆటగాడైన సురేశ్ రైనా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్‌ జట్టును విజయవంతంగా నడిపించినా, ఐపీఎల్‌లో చెన్నైను ఉన్నత స్థానంలో నిలిపినా అది ధోనికే సాధ్యమని రైనా తన మహీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో మరింతో జోష్‌తో బరిలోకి దిగుతున్నామని ఈ స్టార్ బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు.

'ఈ ఏడాది మా జట్టులో చాలా మంది కొత్తవారున్నారు. తమిళనాడు బౌలర్‌ సాయి కిషోర్‌, హజల్‌వుడ్‌, కరాన్‌, పియూష్‌ చావ్లా అంతా కొత్తావారే. వీరంతా మంచి నైపుణ్యం కలిగిన ప్లేయర్లు. వారిలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అటు సీనియర్లు, ఇటు యువ క్రికెటర్లతో మా జట్టు నిండి ఉంది. దాంతో మాకు మరింత మంది అభిమానుల మద్దతు లభిస్తుంది. మేము కూడా ఫ్యాన్స్‌ ఇచ్చే ఉత్సాహంతో మరింత ఎనర్జీగా ఐపీఎల్‌లో అలరిస్తాం. అన్ని రకాల క్రికెటర్లు మా జట్టులో ఉన్నారు' అని రైనా తెలిపాడు.

చావ్లాకు అత్యధిక ధర..

చావ్లాకు అత్యధిక ధర..

టీమిండియా లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాను చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో రూ. 6.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వేలంలో ఆచితూచి వ్యవహరించే చెన్నై పియూష్‌ చావ్లా కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఇక పార్దీవ్ పటేల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.1.70 కోట్లకు అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే.

Story first published: Wednesday, February 19, 2020, 16:49 [IST]
Other articles published on Feb 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+