For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: యూఏఈలో ప్రాక్టీస్ ఆరంభించిన చెన్నై.. అదిరిపోయే లుక్‌లో ఎంఎస్ ధోనీ!!

Chennai Super Kings begin training in Dubai for second leg of IPL 2021
IPL 2021 : ధోనీ న్యూ లుక్.. అస్లీ పిక్చర్ అభీ బాకీ హై..! || Oneindia Telugu

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ జరగనున్నాయి. గత సీజన్‌ మాదిరిగానే దుబాయ్‌, షార్జా, అబుదాబిలో ఐపీఎల్ 14 సీజన్ మ్యాచులు జరుగుతాయి. ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు పూర్త‌యిన ఐపీఎల్‌ 2021లో మ‌రో 31 మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉంది. యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అందరికంటే ముందుగానే యూఏఈలో అడుగుపెట్టిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్.. ప్రాక్టీస్ ఆరంభించింది.

 ప్రాక్టీస్ ఆరంభించిన చెన్నై

ప్రాక్టీస్ ఆరంభించిన చెన్నై

ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌ల కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ ఆగస్టు 13న దుబాయ్ చేరుకుంది. వారం రోజుల పాటు దుబాయ్‌లోని పామ్‌ హోటల్‌లో చెన్నై ప్లేయర్స్ క్వారంటైన్ అయ్యారు. క్వారంటైన్ గడువు పూర్తవడంతో దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో చెన్నై ప్లేయర్స్ గురువారం ప్రాక్టీస్ ఆరంభించారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, పేసర్ దీపక్ చహర్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరియు సీనియర్ ఓపెనర్ రాబిన్ ఉతప్పలు ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబందించిన ఫోటోలను చెన్నై టీమ్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

 నయా లుక్‌లో మహీ

నయా లుక్‌లో మహీ

తాజాగా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఇంటర్నెట్‌లో దుమ్ము రేపుతున్నాడు. మహీ నయా లుక్‌లో రచ్చ రచ్చ చేస్తున్నాడు. 'అస్లీ పిక్చర్ అభీ బాకీ హై' అభిమానులకు పండుగలాంటి పిక్సర్‌ను వదిలాడు. ఈ పిక్చర్‌ను చూసి ధోనీ అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ అయిన స్టార్ స్పోర్ట్స్ ధోనీకి సంబంధించిన ఎక్సలెంట్‌ పిక్‌ని ట్విట్ చేసింది. ఈ ఫోటోలో ధోనీ.. గోల్డెన్ హెయిర్‌తో తళుక్కుమన్నాడు.

ఆ స్మైల్, ఆ హెయిర్ స్టైల్, నయా లుక్‌లో మిస్టర్ కూల్ కాస్తా.. మిస్టర్ స్టైలీష్ అయ్యాడు. 'వివో ఐపీఎల్‌కి ధోనీలోని న్యూ షేడ్‌ని చూడొచ్చు. అస్లీ పిక్చర్ అభీ బాకీ హై' అంటూ కాప్షన్ పెట్టింది. స్టార్ట్ స్పోర్ట్స్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

sandeep sharma: ఓ ఇంటివాడైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్లేయర్!!

రెండో స్థానంలో చెన్నై

రెండో స్థానంలో చెన్నై

ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన ఎంఎస్ ధోనీ 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు.

ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. గెలిపించే ఇన్నింగ్స్‌ ఒక్కటీ కూడా ఆడలేదు. దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా ధోనీ చెలరేగాలని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు. ఆ ఏడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో ధోనీ ఫెయిలైనా.. కెప్టెన్, వికెట్ కీపర్‌గా మాత్రం అద్భుతంగా రాణించాడు.

ఒకే ఫ్రేమ్‌లో

ఒకే ఫ్రేమ్‌లో

త‌మిళులు ఎంత‌గానో ఆరాధించే స్టార్ హీరో త‌ల‌ప‌తి విజ‌య్‌.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క‌లిసి దిగిన ఓ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విషయం తెలిసిందే. చెన్నైలోని గోకులం స్టూడియోలో బీస్ట్ షూటింగ్ కోసం వెళ్లిన విజ‌య్‌.. క‌మ‌ర్సియ‌ల్స్ షూట్‌లో పాల్గొన‌డానికి వెళ్లిన ధోనీ క‌లిశారు. ఒకే స్టూడియోలో ఉన్నామ‌ని తెలియ‌డంతో ఈ ఇద్ద‌రూ క‌లిసి కాసేపు స‌ర‌దాగా ముచ్చ‌టించుకున్నారు. చాలా సమయం త‌ల‌ప‌తి, త‌ల మాట్లాడుకున్నారట. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Story first published: Friday, August 20, 2021, 16:45 [IST]
Other articles published on Aug 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+