For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

sandeep sharma: ఓ ఇంటివాడైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్లేయర్!!

Sunrisers Hyderabad Bowler Sandeep Sharma Gets Married To Tasha Sathwick

హైదరాబాద్: టీమిండియా ప్లేయర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) పేసర్ సందీప్‌ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్‌ను శుక్రవారం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సందీప్‌ శర్మ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యాజమాన్యం సందీప్‌కు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. 2018లో సందీప్‌ శర్మ, తాషా సాత్విక్‌కు ఎంగేజ్మెంట్ జరిగింది.

సందీప్‌ శర్మ, తాషా సాత్విక్‌ పెళ్లి ఫొటోను షేర్‌ చేస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ శుభాకాంక్షలు తెలిపింది. 'ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యామిలీలోకి ప్రత్యేకమైన వ్యక్తి చేరింది. కంగ్రాట్స్‌ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ సందీప్‌ శర్మ. మీ సుదీర్ఘ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం' అని ఎస్‌ఆర్‌హెచ్‌ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు సందీప్‌, తాషాల జోడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సహచర క్రికెటర్లు కూడా అతడికి అభినందనలు తెలుపుతున్నారు. తాషా సాత్విక్‌ వృత్తిరిత్యా ఫ్యాషన్‌, నగల డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 2018లోనే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అయినప్పటికీ.. కరోనా కారణంగా వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు.

సందీప్‌ శర్మ భారత్ తరఫున రెండు టీ20లు ఆడాడు. 42 బంతులు వేసి 73 రన్స్ ఇచ్చి.. ఒక వికెట్ పడగొట్టాడు. జూలై 17, 2015లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇక 2013 నుంచి ఐపీఎల్‌ టోర్నీలో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన సందీప్‌ 110 వికెట్లు తీశాడు. 2013 నుంచి 2017 వరకు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు ఆడిన సందీప్‌.. ఆ తర్వాత 2018 నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడాడు.

ఐపీఎల్ 2021 నిలిచే సమయానికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం అందుకుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఎస్‌ఆర్‌హెచ్‌ సెమీస్ చేరడం కాస్త కష్టమనే చెప్పాలి. ఇక యూఏఈలో సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరుగుతుంది. ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు పూర్త‌యిన ఐపీఎల్‌ 2021లో మ‌రో 31 మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉంది. గత సీజన్‌ మాదిరిగానే దుబాయ్‌, షార్జా, అబుదాబిలో ఐపీఎల్ 14 సీజన్ మ్యాచులు జరుగుతాయి. టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి.

Story first published: Friday, August 20, 2021, 14:55 [IST]
Other articles published on Aug 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+