
సచిన్ ట్వీట్ చేసిన వెంటనే
సచిన్ ట్వీట్ చేసిన వెంటనే అతడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. అతడి పేరు గురుప్రసాద్. 46 ఏళ్ల గురు ప్రసాద్ గతంలో ఓ మ్యాచ్‌కోసం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ తాజ్‌లో బసచేసిన ఫ్లోర్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో సచిన్ రూమ్ నుంచి బయటకువచ్చి లిఫ్ట్ వద్దకు వెళ్లబోతుండగా ఆటోగ్రాఫ్ అడిగాడు.

సచిన్ ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో
అప్పుడు అతడి వద్ద పేపర్ లేకపోవడంతో సెక్యూరిటీ బీట్ నోట్‌బుక్‌లోనే సచిన్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. సచిన్ ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో "సర్ మీరేమనుకోనంటే క్రికెట్‌కు సంబంధించి ఓ సూచన చేయొచ్చా" అని అడిగాడు. సచిన్ చెప్పమని అడగ్గా... మీ ఎల్బోగార్డ్ వల్ల బ్యాటింగ్ సమయంలో అసౌకర్యానికి గురవుతున్నారని సచిన్‌కు చెప్పాడు.
Very happy: హెట్‌మెయిర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై పొలార్డ్

ఓ అభిమాని తన బ్యాటింగ్‌ను
దీంతో ఓ అభిమాని తన బ్యాటింగ్‌ను అంత తీక్షణంగా గమనిస్తుండడం చూసి సచిన్ ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత సచిన్ తనకు సరిపడా సైజ్‌లో ఎల్బో గార్డ్‌ని చేయించుకుని కొన్నేళ్ల పాటు తన కెరీర్‌ను కొనసాగించాడు. 18 ఏళ్ల తర్వాత సచిన్ ఆ సంఘటనను గుర్తు చేసుకుని అతడిని కలవాలన్న ఆకాంక్షను ట్విటర్ ద్వారా వ్యక్తంజేశాడు.

చిన్‌ను సాదరంగా ఆహ్వానిస్తాం
ఈ నేపథ్యంలో సచిన్‌ను సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపాడు. తన ఇంటికి వస్తే తమిళ సంప్రదాయాలతో గౌరవిస్తానని, తన కుటుంబ సభ్యుల్ని కలవడానికి సచిన్ కాస్త సమయం ఇవ్వాలని గురుప్రసాద్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
