Very happy: హెట్‌మెయిర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై పొలార్డ్

హైదరాబాద్: చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియాపై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ హెట్‌మెయిర్‌పై ఆ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనొక విధ్వంసకర ఆటగాడని, తనదైన రోజున బ్యాట్‌తో చెలరేగిపోతాడని పొలార్డ్ కొనియాడాడు.
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం చెన్నైలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండిస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ "హెట్‌మెయిర్ అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడన్న విషయం మాకు తెలుసు" అని అన్నాడు.

తీవ్ర ఒత్తిడిలో హెట్‌మెయిర్
"గత తొమ్మిది నెలల నుంచి బ్యాటింగ్‌లో అతడు ఇబ్బంది పడుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మా జట్టులో అతనికి ఉన్న పాత్ర ఏమిటో తెలుసు. అందుకే అతడిపై నమ్మకం ఉంచాం. గత 18 నెలల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు గడ్డు పరిస్థితుల్ని కూడా హెట్‌మెయిర్ చూశాడు" అని పొలార్డ్ పేర్కొన్నాడు.

హెట్‌మెయిర్ నుంచి ఒక అద్భుత ఇన్నింగ్స్
"చాలా రోజుల తర్వాత హెట్‌మెయిర్ నుంచి ఒక అద్భుత ఇన్నింగ్స్ రావడంతో జట్టు మేనేజ్‌మెంట్ చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో ప్రతీ ఒక్కరూ రాణించడంతోనే అలవోక విజయాన్ని సాధించాం. మా ప్రధాన బౌలింగ్ ఆయుధం కాట్రెల్ ఎంతో పరిణితి చెందాడు. మా కరీబియన్ జట్టులో చాలా టాలెంట్ ఉంది. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది" అని పొలార్డ్ వెల్లడించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అనంతరం 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హెట్‌మెయిర్(139; 106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు), షాయ్ హోప్(102 నాటౌట్; 151 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లు సెంచరీలు సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications