Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: ఎంఎస్ ధోనీకి బంగారు టోపీ.. ఎందుకో తెలుసా?!!

Chennai honors MS Dhoni with golden cap at special award ceremony

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే). టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఇప్పటి వరకూ మూడుసార్లు విజేతగా నిలిచింది. అంతేకాదు ప్రతి సీజన్లోనూ ప్లే ఆప్స్ చేరింది. అదంతా మహీ వలనే అని అందరికి తెలిసిన విషయమే. మహీ ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి చెన్నై ప్రాంచైజీకే సారథిగా ఉన్నాడు. పదేళ్ల పాటు చెన్నై జట్టుకే ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఫిక్సింగ్ నేపథ్యంలో రెండేళ్ల పాటు మరో జట్టుకు ఆడాడు.

ధోనీకి బంగారు టోపీ:

ధోనీకి బంగారు టోపీ:

చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెన్నై ఫ్రాంచైజీ 'బంగారు టోపీ'ని బహూకరించింది. 'తలా'గా చెన్నైని ముందుండి నడిపిస్తున్న ధోనీ.. పదేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించాడు. ఐపీఎల్ గత ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసినందుకు గానూ చెన్నై ఫ్రాంచైజీ 'బంగారు టోపీ'ని బహూకరించింది. 'మాకు చాలా గర్వంగా ఉంది. సూపర్ డూపర్ అవార్డులను మా సారథికి అందించాం. పదేళ్ల పాటు చెన్నై జట్టును తలా ధోనీ నడిపించాడు. గత ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేశాడు' అని ట్వీట్ చేసింది.

జడేజాకు బంగారు కత్తి:

జడేజాకు బంగారు కత్తి:

టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యేక బంగారు కత్తిని చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ బహూకరించింది. ఐపీఎల్ 2019లో సీఎస్‌కే స్టార్ పెర్ఫార్మర్‌గా నిలిచినందుకు ఓపెనర్ షేన్ వాట్సన్‌కు ప్రత్యేక బహుమతి లభించింది. చెన్నై ఫ్రాంచైజీతో 10 సంవత్సరాలు పూర్తి చేసినందుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ కూడా బహుమతి అందుకున్నాడు. వీటికి సంబందించిన పోటోలను సీఎస్‌కే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

మరికొన్ని గంటల్లో మెగా లీగ్‌ ఆరంభం:

మరికొన్ని గంటల్లో మెగా లీగ్‌ ఆరంభం:

కరోనా వైరస్‌తో ఆందోళనలో ఉన్న ప్రపంచాన్ని క్రికెట్‌ లోకంలోకి తీసుకెళ్లి.. అలరించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ సిద్ధమైంది. క్రీడా పోటీలు లేక మంచి ఆకలి మీద ఉన్న అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ పెట్టేందుకు మరికొన్ని గంటల్లో మెగా లీగ్‌ ఆరంభం కానుంది. శనివారం అబుదాబి వేదికగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

14 నెలల తరువాత బరిలోకి:

14 నెలల తరువాత బరిలోకి:

2019 జులై 10న చివరగా ఎంఎస్ ధోనీని మైదానంలో బరిలోకి దిగాడు. 2020 సెప్టెంబరు 19 మళ్లీ అతడు మైదానంలోకి దిగనున్నాడు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మామూలుగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైపోయిన ఆటగాళ్లపై ఐపీఎల్‌లో ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ మహీ పరిస్థితి భిన్నం. ముందుకన్నా అతడి ఆటపై ఎక్కువ ఆసక్తి కనిపిస్తోందిప్పుడు. ఇక ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తాడనే ఆలోచన కోట్లాదిమంది అతడి అభిమానుల్ని లీగ్‌కు అతుక్కుపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే చివరగా ఆడినపుడు ధోనీ ఏమంత గొప్ప ఫామ్‌లో లేడు. ఇప్పుడు వయసు 39 ఏళ్లు దాటింది. ఫిట్‌నెస్‌పై సందేహాలున్నాయి. ఏడాదికి పైగా విరామం తర్వాత మ్యాచ్‌లు ఆడబోతున్నాడు. ఈ స్థితిలో మహీ బ్యాటింగ్‌లో, వికెట్‌ కీపింగ్‌లో ఏమాత్రం చురుకుదనం చూపిస్తాడో చూడాలి.

IPL 2020 ప్రిపరేషన్ పూర్తయింది.. ఇక బరిలోకి దిగడమే: రోహిత్ శర్మ

Story first published: Saturday, September 19, 2020, 8:19 [IST]
Other articles published on Sep 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+