IPL 2022: ఏందిరా? ఈ చిల్లర వేశాలు.. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌పై ఫ్యాన్స్ ఫైర్

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. సోషల్ మీడియా వేదికగా ఆ జట్టు చేసిన పనిపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిల్లర వేశాలు ఏంటనీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా టీమ్‌ను మారుస్తున్నామంటూ ఆ టీమ్‌మేనేజ్‌మెంట్ శుక్రవారం చేసిన ప్రాంక్‌ను అభిమానులు సహించలేకపోతున్నారు. కొంతమంది అయితే ఆర్‌ఆర్ ట్విటర్ హ్యాండిల్‌ను అన్‌ఫాలో కూడా చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
తమ కెప్టెన్ ఫొటోతో రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ సరదాగా ఓ పోస్ట్ చేయగా.. దానిపై సంజూ శాంసన్ సీరియస్ అయ్యాడు. సంజూ శాంసన్ పాత ఫోటోను తీసుకొని దానికి కూలింగ్ గ్లాసెస్, రాజస్తాన్ రాయల్స్ సంప్రదాయ తలపాగాను చుట్టి.. చెవులకు కమ్మలు పెట్టి ఎడిట్ చేశాడు. దానికి'మీరు ఎలా ఉన్నారో'చూసుకోండి అంటూ సంజూ శాంసన్‌కు ట్యాగ్ చేశాడు. అయితే ఈ ఫోటోపై శాంసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మనం ఏమన్నా స్నేహితులమా? అంటూ మండిపడ్డాడు. ఫ్రొఫెషనల్‌గా ఉండాలంటూ అసహనం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా రాజస్థాన్ రాయల్స్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను అన్‌ఫాలో చేశాడు.
అడ్మిన్‌ను మారుస్తున్నామని..
ఆ వెంటనే రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. సోషల్ మీడియా వ్యూహాలపై పున సమీక్ష చేస్తామని, సోషల్ మీడియా టీమ్‌ను కూడా మార్చేస్తున్నామని పేర్కొంది. జట్టులోని ఆటగాళ్లంతా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్దమవుతున్నారని తెలిపింది. అతి త్వరలోనే కొత్త సోషల్ మీడియా టీమ్‌ను అపాయింట్ చేస్తామని పేర్కొంది. ఇదంతా నిజమేనని నమ్మిన ఫ్యాన్స్.. ఆర్‌ఆర్ అడ్మిన్‌పై ఉన్న ప్రేమతో సంజూ శాంసన్‌పై విమర్శలు గుప్పించారు. ఆర్‌ఆర్ అడ్మిన్ టీమ్ కూడా ఇదే చివరి ట్వీట్ అంటూ.. తమ ఆఫీస్‌ను వదిలేస్తున్న వీడియోను షేర్ చేసింది.
ఫ్రాంక్ అని చెప్పడంతో..
తీరా చూస్తే ఇదంతా ఫ్రాంక్ అని శనివారం రాజస్థాన్ రాయల్స్ స్పష్టం చేసింది. కొత్త ఆర్‌ఆర్ అడ్మిన్‌ను అపాయింట్ చేస్తున్నామని, దానికి ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో చాహల్, హెట్‌మైర్ తదితర ఆటగాళ్లు పాల్గొన్నారు. ఆడిషన్స్ లేకుండా ప్రాంక్ ముగియలేదంటూ ఆర్ఆర్ ట్వీట్ చేసింది. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిన్న ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం ఓ చానల్ ప్రమోషన్ కోసం ఇలానే ప్రాంక్ చేసిన విషయం తెలిసిందే.
చిల్లర వేశాలు ఎందుకు?
వరుసగా ప్రాంక్స్ చేస్తూ అభిమానులను ఫూల్స్ చేస్తుండటంతో వాళ్లు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. ఈ చిల్లర వేశాలు ఏంటని మండిపడుతున్నారు. ముంబై, చెన్నై, ఇలాంటి చెత్త ఫ్రాంక్స్ చేయడం లేదని, వారిని చూసి నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఇక ఆర్‌సీబీ మాత్రం యాడ్స్ ట్వీట్ చేస్తుంటే.. ఆర్‌ఆర్ ఫ్రాంక్స్ చేస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications