భారత జట్టు నుంచి కేఎల్ రాహుల్‌ను తప్పించాలా? చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే?

న్యూఢిల్లీ: సాంకేతిక ప్రపంచంలోకి విప్లవాత్మకంగా దూసుకొచ్చిన 'చాట్ జీపీటీ' సంచలనాలు సృష్టిస్తోంది. కృత్రిమ మేధస్సుతో పని చేసే ఈ కొత్త తరం సెర్చ్ ఇంజిన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టూల్‌తో మాట్లాడేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. తమకు తెలియని ఎన్నో ప్రశ్నలకు చాట్ జీపీటీ సాయంతో సమాధానాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్‌లో చర్చనీయాంశమైన కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ గురించి చాట్‌జీపీటీని ప్రశ్నిస్తే దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.

నాకంటూ వ్యక్తిగత అభిప్రాయలు..
కేఎల్ రాహుల్‌ను భారత జట్టు నుంచి తప్పించాలా? అని ప్రశ్నించగా.. 'కృత్రిమ మేధస్సుతో పనిచే లాంగ్వేజ్ మోడల్‌ను నేను. వ్యక్తులు, జట్ల పట్ల నాకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. పక్షపాత ధోరణి కూడా నాకు ఉండదు. అయితే సాధారణంగా జరిగే విషయాలను దృష్టిలో ఉంచుకొని కేఎల్ రాహుల్ జట్టులో ఉంచాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నీకు సాయం చేస్తా. కేఎల్ రాహుల్ ఎంతో నైపుణ్యం కలిగిన ఆటగాడు. గతంలో భారత క్రికెట్ టీమ్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇటీవల అతను నిలకడలేమి ఆటతో సతమతమవుతున్నాడు. దాంతో జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని..
అయితే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే క్రికెట్.. జట్టుగా ఆడే ఆట. గాయాలు, బలమైన ప్రత్యర్థి, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం వంటి కారణాల వల్ల ఆటగాళ్లు ఫామ్ కోల్పోతుంటారు. అంతిమంగా టీమ్‌మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు ఆటగాడిని జట్టులో నుంచి తప్పించడంపై నిర్ణయం తీసుకుంటారు. అయితే గత కొంత కాలంగా అతని ప్రదర్శన ఎలా ఉంది? పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడా? లేడా? జట్టు ప్రయోజనాలు, అవసరాలకు అనుగుణంగా రాణిస్తున్నాడా? టీమ్ కాంబినేషన్‌కు సరిపోతాడా? ప్రత్యర్థి జట్టుకు తగ్గ ఆటగాడా? కాదా? అనే అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. రాహుల్ విషయంలో కూడా ఇవన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారు.'అని చాట్ జీపీటీ సమాధానం చెప్పింది.

ఫ్యాన్స్ ఫిదా..
చాట్ జీపీటీ చెప్పిన సమాధానానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. సరిగ్గా సమాధానం చెప్పిందని చాట్ జీపీటీని కొనియాడుతున్నారు. ఈ ఏఐ టెక్నాలిజీకి ఉన్న బుద్ది కూడా టీమ్‌మేనేజ్‌మెంట్‌కు లేదని మండిపడుతున్నారు. ఇక రాహుల్ పేలవ ఫామ్‌పై మాజీ క్రికెటర్ల గొడవపడటం.. అభిమానులు తిట్టడం ధాటి రాజకీయ నాయకులు మాట్లాడే స్థాయికి చేరింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. రాహుల్ పేలవ ఫామ్‌పై బీసీసీఐని నిలదీయడం, సంజూ శాంసన్‌కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం హాట్‌టాపిక్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications