వరల్డ్‌కప్ వండర్ బామ్మ ఇకలేరు..

హైదరాబాద్ : ఇంగ్లండ్ వేదికగా గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌లో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బూరపరిచిన టీమిండియా సూపర్ ఫ్యాన్, క్రికెట్ బామ్మ చారులత పటేల్(87) ఇకలేరు. గత సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారని చారులత పటేల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ cricket.daadi వేదికగా కుటుంబసభ్యులు తెలిపారు.
'బరువెక్కిన గుండెతో మీ అందరికి మా బ్యూటిఫుల్ బామ్మ లేరనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆమె గత బుధవారం సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మీ అందరి ప్రేమలను అందుకున్న ఆమె నిజంగా అదృష్టవంతురాలు. మా బామ్మే మా సర్వస్వం. గతేడాది ఆమెకు గొప్ప అనుభూతినిచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఆమెను కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు పెద్ద థ్యాంక్స్.. వారిని కలుసుకున్న విషయాన్ని ఆమె పదేపదే ప్రస్తావించేది. ఆమె ఆత్మకు శాంతి కలిగించాలని ఆ దేవున్ని కోరుకుంటున్నా. మీరు కూడా ఆమె కోసం ప్రార్థనలు చేయండి.'అని ఆమె గ్రాండ్ చిల్డ్రన్ సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నారు.
బీసీసీఐ సంతాపం..
సూపర్ ఫ్యాన్ చారులత పటేల్ మరణం పట్ల బీసీసీఐ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘టీమిండియా సూపర్ ఫ్యాన్ చారులతగారు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు. క్రికెట్ పట్ల ఆమెకున్న ఫ్యాషన్ ఎప్పటికీ మమ్మల్ని మోటీవేట్ చేస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం.'అని పేర్కొంది. యావత్ క్రికెట్ అభిమానులు కూడా ఆమెకు సంతాపంగా ట్వీట్ చేస్తున్నారు.
టీమిండియా సూపర్ ఫ్యాన్
వరల్డ్‌కప్ సందర్భంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా.. 87 ఏళ్ల చారులత పటేల్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఎంతలా అంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు గ్యాప్ వచ్చిన ప్రతీసారీ కెమెరామెన్ ఆ పెద్దావిడ వైపే తన ఫోకస్ పెట్టేంతగా! మ్యాచ్ ఆరంభం నుంచీ కెమెరా కళ్లన్నీ ఆమె చుట్టే తిరిగాయి. పొడుగు చేతుల స్వెట్టర్, మెడలో స్కార్ఫ్‌లా ధరించిన దుపట్టా, చెంపలపై త్రివర్ణ పతాకాన్ని పెయింట్ వేసుకుని తన అభిమానాన్ని చాటుతూ.. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా నిలిచారు. టీమిండియా బ్యాట్స్‌మెన్లు షాట్ కొట్టిన ప్రతీసారీ.. పొడుగాటి బూరను ఊదుతూ చిన్నపిల్లలా మారిపోయారు.నడవలేని స్థితిలో ఉన్నా- మ్యాచ్‌ను చూడాలనే ఆశతో వీల్ ఛైర్‌లో స్టేడియానికి వచ్చారు.

ఆశీర్వాదాన్ని అందుకున్న విరాట్, రోహిత్!
ఆమె చేసిన సందడి కేప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కేప్టెన్ రోహిత్ శర్మలను కూడా ఆకర్షించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం వారిద్దరు నేరుగా- చారులతా పటేల్ వద్దకు వెళ్లారు. భక్తిభావంతో నమస్కరించి ఆమె ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆమెతో మచ్చటించరు.ఈ సందర్బంగా చారులత ఆప్యాయంగా విరాట్ కోహ్లీని ముద్దాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దాన్ని షేర్ చేశారు. దీంతో ఆమె వరల్డ్ వైడ్ స్టార్ అయ్యారు. ఆమె దగ్గరికి చానల్స్ అన్ని పరుగుపెట్టాయి.

ఆనంద్ మహీంద్రా స్పాన్సర్..
భారత్ దిగ్గజ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమె అభిమానానికి ముగ్ధుడయ్యారు. ఆమె మ్యాచ్ టికెట్ల ఖర్చు భరిస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. " ఆమెను చూసేందుకే టీవీ ఆన్ చేస్తున్నాను. ఆమె మ్యాచ్ విన్నర్ లాగా ఉంది" అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఓ నెటిజన్ ఆమెకు మీరు ఎందుకు స్పాన్సర్ చేయకూడదు? అంటూ ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించాడు. దీంతో ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్‌లో "ఆమె ఎవరు కనిపెట్టండి. టీమిండియా ఆడే తదుపరి మ్యాచ్ టికెట్లు, ఇతర ఖర్చులు స్పాన్సర్ చేస్తా" అంటూ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో ప్రకటించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications