Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: భారత్‌కు జాక్ పాట్..ఇప్పుడు కూడా గెలవకపోతే..!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. 2013లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పాకిస్థాన్ జరిగిన ఫైనల్లో ఓటమిపాలైంది. అయితే ఈసారి టైటిల్‌ అందుకునే సువర్ణవకాశం టీమిండియాకు లభించింది.

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి.

Champions Trophy 2025 Why India Will Have A Big Advantage Over Other Teams For Playing Dubai

బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో గ్రూప్-ఏలో ఉన్న భారత్.. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. ఫిబ్రవరి 23న ఆతిథ్య పాకిస్థాన్‌తో తలపడనుండగా.. మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది.

ఈ టోర్నీలో మిగతా జట్లకు లేని ప్రత్యేక వెసులుబాటు టీమిండియాకు లభించింది. టీమిండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. ఒకవేళ సెమీఫైనల్ చేరినా.. ఫైనల్‌కు అర్హత సాధించినా.. నాకౌట్ మ్యాచ్‌లు కూడా దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య హైబ్రిడ్ మోడల్‌పై ఒప్పందం జరిగింది. భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ మ్యాచ్‌లు తటస్థ వేదికగా జరగనున్నాయి.

అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఒకే వేదికగా అన్నీ మ్యాచ్‌లు ఆడనుండటం కలిసి రానుంది. ఇతర జట్లలా ప్రతీ వేదికలోని పరిస్థితులను అర్థం చేసుకునే అవసరం టీమిండియాకు ఉంది. ఒక్కసారి దుబాయ్ పరిస్థితులకు అలవాటు పడితే మిగతా మ్యాచ్‌ల్లో సునాయసంగా రాణించవచ్చు.

లీగ్ దశలో టీమిండియా విజయాలు సాధించి నాకౌట్‌కు చేరితే దుబాయ్ వేదికను హోమ్ గ్రౌండ్‌లా భావించవచ్చు. మిగతా జట్లకే ఈ వెసులు బాటు లేదు. పాకిస్థాన్ వేదికగా ఉన్న అన్నీ మైదానాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇంత మంచి వెసులు బాటు టీమిండియాకు ఉన్నప్పుడు టైటిల్ గెలవాలని, లేకుంటే అంతే సంగతులని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Saturday, January 11, 2025, 19:07 [IST]
Other articles published on Jan 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+